క్లీన్ స్వీప్ పై గురి పెట్టిన ఇండియా ... కివీస్ అడ్డుకుంటుందా ?

VAMSI
ఇండియా పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కు విజయం ఇంకా అందని ద్రాక్షలాగే ఉంది. ఈ పర్యటనలో మూడు వన్ డే లు మరియు మూడు టీ 20 లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పటికే రెండు మ్యాచ్ లో పూర్తి కాగా, రెండింటిలోనూ కివీస్ ఓడిపోయి వన్ డే సిరీస్ ను పోగొట్టుకుంది. ఈ రోజు ఇండోర్ వేదికగా మూడవ వన్ డే జరగనుంది. వరుస విజయాలతో ఇండియా ఊపుమీద ఉంది, ఈ మ్యాచ్ లో ఇండియా కనుక విజయం సాధిస్తే కివీస్ క్లీన్ స్వీప్ కు గురవుతుంది. మరి నామమాత్రం అయిన ఈ మ్యాచ్ లో ఇండియా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక కనీసం ఈ మ్యాచ్ లో అయినా విజయం సాధించాలన్న కసితో టామ్ లాతమ్ సారధ్యంలోని కివీస్ జట్టు బరిలోకి దిగుతోంది.
మొదటి మ్యాచ్ లగే ఈ మ్యాచ్ లోనూ పరుగుల వరద ఖాయంగా తెలుస్తోంది. కివీస్ ముఖ్యంగా ఈ రెండు మ్యాచ్ లలో ఓటమై చెందడానికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యం మరియు నిలకడ లేమి అని చెప్పాలి. ఇండియా బ్యాటింగ్ లో దూకుడుగా ఉన్న శుబ్మాన్ గిల్ , రోహిత్ మరియు కోహ్లీ లను నిలువరించడంలో ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా శుబ్మాన్ గిల్ మొదటి వన్ డే లో అద్భుతమైన డబల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్ లోనూ మొదట బ్యాటింగ్ వచ్చి ఉంటే మరో సెంచరీ చేసి ఉండేవాడు. కానీ ఛేజింగ్ రావడం వలన కేవలం 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇంకాసేపట్లో టాస్ పడనుంది... టాస్ గెలిచిన టీం ముందుగా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో బెంచ్ పై ఉన్న రజత్ పాటిదార్, శ్రీకర్ భరత్ మరియు షహబాజ్ అహ్మద్ లకు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. అదే విధంగా కివీస్ లోనూ రెండు మూడు మార్పులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ రౌండర్ లను తుది జట్టులోకి తీసుకునే విషయంపై దృష్టి సారిస్తారని అంచనా.. మరి కివీస్ కు కీలకం అయిన ఈ మ్యాచ్ లో ఇండియాను అడ్డుకుంటారా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వెయిట్ చేయాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: