వరల్డ్ కప్ 2023: క్వార్టర్స్ కు అడుగు దూరంలో టీం ఇండియా !

VAMSI
ప్రస్తుతం ఇండియా వేదికగా పురుషుల హాకీ వరల్డ్ కప్ గత వారం రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. మన జాతీయ క్రీడా హాకీ కావడం వలన ప్రత్యేక శ్రద్ధతో ఈ మ్యాచ్ లను ఇండియా అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక ఈ టోర్నీకి ముందు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వరల్డ్ కప్ టైటిల్ ను కనుక గెలిస్తే భారీ నగదు బహుమతిని ఇస్తానని చెప్పడం మనము చూశాము. ఇలా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా హాకీ టీం పూల్ డి లో ఇంగ్లాండ్, స్పెయిన్ మరియు వేల్స్ లతో కలిసి ఆడుతోంది. ఇప్పటికే ఇండియా లీగ్ స్టేజి లో మూడు మ్యాచ్ లను పూర్తి చేసుకుంది. మూడింటిలో రెండు మ్యాచ్ లను గెలుచుకుని , ఒక మ్యాచ్ ను డ్రా గా చేసుకుని పాయింట్ లతో రెండవ స్థానంలో ఉంది.
అయితే ఇండియా కన్నా ఇంగ్లాండ్ కు గోల్స్ ఎక్కువగా ఉండడంతో మొదటి స్థానంలో నిలిచింది. అయితే క్వార్టర్స్ కు చేరుకోవాలంటే వేల్స్ తో ముగిసిన మ్యాచ్ లో భారీ తేడాతో గెలవాల్సి ఉంది. కానీ కేవలం 4 - 2 గోల్స్ తేడాతో మాత్రమే సాధారణ గెలుపును అందుకుంది. దీనితో ఇండియా క్వార్టర్స్ కు ఇంకా చేరువ కాలేదు. కాగా స్పెయిన్ తో భారీ విజయాన్ని సాధించిన ఇంగ్లాండ్ మాత్రం క్వార్టర్స్ కు చేరుకుంది. ఇక స్పెయిన్ మరియు వేల్స్ లు పేలవమైన ప్రదర్శనతో లీగ్ నుండి నిష్క్రమించాయి. ఇక ఇండియా కనుక క్వార్టర్స్ చేరాలంటే మన ముందున్న ఒకే ఒక్క అవకాశం ఆదివారం రోజున న్యూజిలాండ్ తో జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్ లో విజయం సాధించడమే.
ఇక న్యూజిలాండ్ కూడా ఏమంత అద్భుతమైన ఫామ్ లో అయితే లేదు. తాను గ్రూప్ సి లో ఆడిన మూడు మ్యాచ్ లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి ఇప్పటికే క్వార్టర్స్ కు దూరమైంది. కాబట్టి ఆదివారం మ్యాచ్ లో ఇండియా గెలిచి క్వార్టర్స్ కు వెళ్లి ... కప్ సాధించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: