కోహ్లీ సలహాతోనే.. టీమ్ ఇండియా గెలిచింది : శార్దూల్

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న అందరూ ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ ప్రదర్శనలతో ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు క్రికెటర్లు. ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి ప్రదర్శన చేసి శార్దూల్ ఠాగూర్ టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయాడు అని చెప్పాలి. న్యూజిలాండ్ ఓడిపోతుంది అనుకున్న దశ నుంచి ఇక ఆ జట్టు బ్యాట్స్మెన్ మైకేల్ బ్రేస్ వెల్  సిక్సులు బౌండర్లతో రెచ్చిపోయి ఇక విజయం వైపు జట్టును నడిపించాడు.

 ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో ఇక న్యూజిలాండ్ జట్టు విజయం సాధించడం ఖాయమని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో ఇక అద్భుతమైన యార్కర్ సంధించిన శార్తుల్ ఠాగూర్ అటు న్యూజిలాండ్ ప్లేయర్ మైకేల్ బ్రేస్ వెల్ వికెట్ పడగొట్టి అటు న్యూజిలాండ్ జట్టుకు విజయం పై ఉన్న ఆశలను ఆవిరి అయ్యేలా చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా సరైన సమయంలో సరైన బంతిని సంధించి శార్దూల్ ఠాగూర్ టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయాడు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే కీలకమైన సమయంలో మైఖేల్ బ్రేస్వెల్ ను అవుట్ చేసిన విధానం గురించి.. ఇక ఆ బంతి వేయడానికి ముందు జరిగిన విషయం గురించి కూడా ఇటీవల శార్దూల్ ఠాగూర్ చెప్పుకొచ్చాడు.

 అప్పటికే  భారత బౌలర్ల బౌలింగ్ లో కూడా సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ బ్రేస్ వెల్ ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక చివరి ఓవర్ లో శార్దూల్ ఠాగూర్ బౌలింగ్ చేశాడు. ఇక అద్భుతమైన యార్కర్ సంధించి అవుట్ చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతకుముందు తనకు ఇక యార్కర్ వేయాలని విరాట్ కోహ్లీ సూచించాడు అంటూ శార్దూల్  ఠాగూర్ చెప్పుకొచ్చాడు. ఇక అతను సరైన సమయంలో సరైన సలహా ఇచ్చాడని అతను చెప్పిన విధంగానే యార్కర్ వేశానని.. దీంతో వికెట్ దక్కిందని శార్దూల్ ఠాగూర్  చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి కోహ్లీ ఎప్పుడు విలువైన సలహాలు ఇస్తాడు అని అతని అభిమానులు అనుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: