ఎన్నాళ్ళకెన్నాళ్లకు.. కోహ్లీ మైదానంలో స్టెప్పులేసాడుగా?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ తన బ్యాటింగ్ తో ఎప్పుడు అభిమానులందరినీ కూడా అలరిస్తూ ఉంటాడు. ప్రపంచ రికార్డులు కొల్ల గొడుతూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోతూ ఉంటాడు. ఇక తన సెంచరీల తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇలా కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కాకుండా మైదానం వెలుపల ప్రేక్షకులను అలరించడం లో కూడా విరాట్ కోహ్లీ ఎప్పుడు ముందుంటాడు అని చెప్పాలి. ఎప్పుడు తనదైన శైలి లో ప్రేక్షకులను ఆకట్టు కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

 ఈ క్రమం లోనే ఇప్పుడు వరకు విరాట్ కోహ్లీ అటు మైదానం లో ఎన్నో సార్లు డాన్సులు చేసి ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించిన  ఘటనలు చాలాసార్లు ఉన్నాయి. ఇక ఇటీవలే మరో సారి ఇలా కోహ్లీ అదిరిపోయే స్టెప్పుల తో డాన్స్ చేసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇటీవలే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా జట్టు వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్లో సెంచరీ తో చలరేగిన కోహ్లీ రెండవ మ్యాచ్లో మాత్రం తక్కువ పరుగులకు వికెట్ కోల్పోయాడు.

 అయినప్పటికీ కె.ఎల్ రాహుల్ ఆఖరి వరకు పట్టుదలగా పోరాడి జట్టును గెలిపించాడు. అయితే ఇలా వన్డే సిరీస్ గెలుచుకున్న సంతోషాన్ని విరాట్ కోహ్లీ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితమైన ఝార్ఖండ్ డైనమిక్ ఇషాన్ కిషన్ తో కలిసి మైదానంలో డాన్స్ ఇరగదీసాడు అని చెప్పాలి. బెంగాల్ క్రికెటర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లేజర్ లైట్ షో వెలుగుల్లో హుషారుగా స్టెప్పులు వేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో తెగచక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: