ఈ ఏడాదైనా కోహ్లీ వారి రికార్డులను బ్రేక్ చేస్తాడా?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. క్రికెట్ ప్రపంచంలో తనదైన ఆటను ప్రదర్శిస్తూ ఇతగాడు ఒక సినిమా హీరోకి మాదిరి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు. కోహ్లీ బరిలోకి దిగితే అతడు మెరిపించే మెరుపులకు అతని అభిమానులు మైమరచిపోయి చూస్తూ వుంటారు. ఈ పరంపర ఎంతవరకు కొనసాగిందంటే 2019 వరకు అని చెప్పుకోవాలి. అంతవరకు ఇతగాడి గురించి ప్రతి ఒక్కరూ ప్రస్తావించుకొనేవారు. అవును, అతని బ్యాట్ నుంచి వచ్చే రికార్డుల గురించే ప్రతి ఒక్కరు చర్చించుకునే వారు. అయితే గత మూడేళ్లుగా అతని బ్యాట్‌ మూగబోయిందని చెప్పుకోవాలి.
అక్కడినుండి కాస్త నెమ్మదించాడని చెప్పుకోవాలి. దాంతో కొన్ని విమర్శలు కూడా మూటకట్టుకున్నాడు. పెళ్ళాం అనుష్క మాయలో పడి కోహ్లీ క్రికెట్ ని మర్చిపోయాడని చాలామంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేసేవారు. అయితే 2022 ఏడాదిలో కోహ్లీ అభిమానుల కరువును తీర్చాడనే చెప్పుకోవచ్చు. ఆసియా కప్ 2022 నుంచి విరాట్ మొత్తం 3 సెంచరీల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ ముందు ఒక ఛాలెంజ్ ఉంది.
ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో సెంచరీల రికార్డు విషయంలో మాత్రం మనోడు వెనుకబడ్డాడని చెప్పుకోవాలి. వన్డే ఫార్మాట్‌లో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్  49 సెంచరీలు చేసిన సంగతి తెలిసినదే. అయితే ఈ విషయంలో సచిన్ కోహ్లీ కంటే ముందున్నాడు. అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2019 ఏడాదిలో పరుగుల వరద పారించాడని చెప్పుకోవాలి. ఆ ఏడాది హిట్‌మన్ మొత్తం 7 సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. రోహిత్ శర్మ కేవలం 27 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విషయంలోనే కోహ్లీ తన సహచరులకంటే వెనకబడ్డాడు. అయితే అభిమానులు మాత్రం ఆ రికార్డుని కోహ్లీ అధిగమిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: