అప్పుడే నా రిటైర్మెంట్.. డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు?

praveen
ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ కు సంబంధించిన విషయం ఏది తెరమీదకి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతోంది అని చెప్పాలి.  మొన్నటి వరకు ఏకంగా క్రికెట్ ఆస్ట్రేలియా అతనిపై విధించిన  కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేస్తారేమో అనే దాని గురించి చర్చ జరగగా.. ఇక ఆ తర్వాత డేవిడ్ వార్నర్ పేలవమైన ఫామ్ లో కొనసాగడం గురించి ఎంతోమంది చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది విమర్శలు కూడా గుప్పించారు.

 కానీ ఆ తర్వాత కాలంలో డేవిడ్ వార్నర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి సెంచరీ చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరుసగా మ్యాచ్లలో అదే ప్రదర్శనను కంటిన్యూ చేస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక మొన్నటి వరకు పేలవమైన ఫామ్ లో కొనసాగిన సమయంలో అటు డేవిడ్ వార్నర్ తన కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది అని చర్చ కూడా మొదలైంది. ఇలాంటి సమయంలోనే స్పందించిన డేవిడ్ వార్నర్ తనలో ఇంకా క్రికెట్ ఆడాలనే కసి అలాగే ఉందని ఆ కసిలేని రోజు నేనే రీటైర్మెంట్ ప్రకటిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇప్పటికీ కూడా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతూ ఉంది. ఇక ఇటీవల స్వయంగా దీని గురించి స్పందించిన డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024 సంవత్సరంలో నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అభిమానులకు ట్విస్ట్  ఇచ్చాడు వార్నర్.  అమెరికాలో జరిగే టి20 ప్రపంచ కప్ గెలవడమే నా లక్ష్యం అంటూ తెలిపాడు. ఇక నాదేశానికి వరల్డ్ కప్ అందించి గర్వంగా క్రికెట్ నుంచి తప్పుకుంటాను అంటూ డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను షాక్ కి గురి చేస్తూ ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: