షాకింగ్ న్యూస్ : సౌదీ చట్టాన్ని ఉల్లంఘించిన రోనాల్డో?

praveen
గత కొంతకాలం నుంచి ఫుట్బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియనో రోనాల్డో వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఖాతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా తన ప్రదర్శనతో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆ తర్వాత జట్టు యాజమాన్యం అతని పక్కన పెట్టడంతో వార్తల్లో నిలిచాడు. అయితే ఫిఫా వరల్డ్ కప్ లో సెమి ఫైనల్లో ఓడిపోయి ఇక టోటల్ నుంచి నిష్క్రమించిన సమయంలో చిన్న పిల్లాడిలా ఏడ్చి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే క్రిస్టియానో రోనాల్డో కీలక నిర్ణయం తీసుకొని మరోసారి వార్తల్లో హాట్ టాపిక్గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా సౌదీ ప్రో లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆల్ నజర్ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం 215 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ లీగ్ లో క్రిస్టియానో రోనాల్డో ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఏకంగా సౌదీ ప్రో లీగ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియనో రోనాల్డో మరోసారి వార్తల్లో నిలిచాడు.

 ఇందుకు కారణం ప్రస్తుతం సౌదీలో ఉన్న క్రిస్టియానో రోనాల్డో ఆ దేశ చట్టాన్ని ఉల్లంఘించాడు అని చెప్పాలి. క్రిస్టియానో రోనాల్డో అతని గర్ల్ ఫ్రెండ్ జార్జినాతో పెళ్లి కాకుండానే ప్రస్తుతం సహజీవనంలో కొనసాగుతూ ఉన్నాడు. అయితే సౌదీ చట్టం ప్రకారం ఇది నేరం అన్న విషయం తెలిసిందే. పెళ్లి కాకుండా ఒక మహిళతో సహజీవనం చేయడానికి అక్కడి చట్టం ఒప్పుకోదు. ఈ క్రమంలోనే క్రిస్టియానో రోనాల్డో ఏకంగా సౌదీ చట్టాన్ని ఉల్లంఘించాడు అని చెప్పాలి. కానీ క్రిస్టియానో రోనాల్డో విదేశీయుడు కావడం కారణంగా అతనికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: