వరల్డ్ కప్ గెలవాలంటే.. రోహిత్, కోహ్లీ ముందు అవి మానుకోవాలి : గంభీర్

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా జట్టులో సీనియర్లుగా కొనసాగుతున్న వారికి అటు బీసీసీఐ సెలక్టర్లు తరచూ విశ్రాంతి ప్రకటిస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సీనియర్ ప్లేయర్లు జట్టుకు అందుబాటులో లేకపోవడంతో ఇక యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాలో గందరగోల పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి అని చెప్పాలి. జట్టులో ఉన్న ఇలాంటి పరిస్థితులే ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యానికి కారణం అయ్యాయని.. ఇప్పటికే ఎంతోమంది మాజీ ప్లేయర్లు విమర్శలు గుప్పించారు.

 అయినప్పటికీ అటు బీసీసీఐ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఇక ఇటీవల కొత్త ఏడాదిలో శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్య ను కెప్టెన్గా నియమించింది. ఈ క్రమంలోనే సీనియర్లు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి ప్రకటించింది. ఈ ఇద్దరు ప్లేయర్లు మళ్ళీ వన్డే సిరీస్ కు అందుబాటులోకి వస్తారు. అయితే ఇలా మాటిమాటికి సీనియర్లకు విశ్రాంతి ప్రకటించడం పై స్పందించిన మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వన్డే  వరల్డ్ కప్ ఉన్న ఏడాదిలో అన్నిసార్లు రెస్ట్ తీసుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించాడు. అక్టోబర్  నవంబర్ నెలలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కోహ్లీ రోహిత్ ఇద్దరూ ఏడాదిలో ఆడే వన్డే మ్యాచ్లు అన్నీ ఆడాలని సూచించాడు గౌతమ్ గంభీర్.

 ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకం అంటూ చెప్పుకొచ్చాడు. కాబట్టి విశ్రాంతి తీసుకోకుండా జట్టుకు అందుబాటులో ఉండాలని సూచించాడు. గతంలో మూడు సార్లు వేరే దేశాలతో కలిసి వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి మాత్రం పూర్తిగా భారత్ వేదికగానే వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. వన్డే వరల్డ్ కప్ భారత్ గెలవాలంటే ఏం చేయాలంటూ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ను యాంకర్ ప్రశ్నించగా.. ముందుగా జట్టు కోర్ ఏదో గుర్తించాలి. ఇటీవల కాలంలో మరి ఎక్కువ మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. సెటిల్డ్ గా  ఉన్న టీం కనిపించడం లేదు. దానికి తోడు వరల్డ్ కప్ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అంటూ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: