డబ్బులు జాగ్రత్త.. వేలంలో ఖరీదైన ఆటగాళ్లకు రైనా సలహా?

praveen
భారత క్రికెట్ పరీక్షకులందరూ ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్  2023 సీజన్ కు సంబంధించి మినీ వేలం ప్రక్రియ పూర్తయింది అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 23వ తేదీన కొచ్చి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు సత్తా చాటి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ క్రమంలోనే మినీ వేలం ముగిసినప్పటికీ కూడా ఇప్పటికీ దీనికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈసారి మినీ వేలంలో ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరణ్ ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. ఏకంగా పంజాబ్ కింగ్స్ అతన్ని 18.5 కోట్లకు కొనుగోలు చేసింది అని చెప్పాలి.

 ఇక ఇలా అత్యధిక ధర పలికిన టాప్ 10 ఆటగాళ్లలో ఇక ముగ్గురు భారతీయులు కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే మెగా వేలంపై ఇటీవల ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే మిస్టర్ ఐపిఎల్ గా పేరు సంపాదించుకున్న టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా సైతం వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లకు విలువైన సలహాలు ఇచ్చాడు. ఇక సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.

 వేలంలో ఎక్కువ ధర పలకడం నిజంగా శుభ పరిణామం. అయితే ఇలా ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లు రానున్న రోజుల్లో భారత జట్టుకు కూడా ఆడవచ్చు. ఐపీఎల్ లో వచ్చిన డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. వారి కుటుంబాల కోసం ఇల్లు కొనుగోలు చేయవచ్చు. లేదా వారి శరీర సంరక్షణ కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు.. ఐపీఎల్ లో పొందిన డబ్బుతో ఏం చేయబోతున్నారు అనేది కూడా ఎంతో ముఖ్యమైనది అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవలే జరిగిన మినీ వేలంలో భారత్ తరపున అత్యంత ఖరీదైన ఆటగాడిగా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. అతడిని 8.25 కోట్లకు సన్రైజర్స్ దక్కించుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: