కోహ్లీ ఆ రోజు నన్ను అలా అన్నాడు : సూర్య కుమార్

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య కుమార్ యాదవ్ అని చెప్పాలి . తన అద్భుతమైన ఇన్నింగ్స్ లతో క్రికెట్ ప్రపంచం చూపును మొత్తం తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు సూర్య కుమార్ యాదవ్. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి తిరుగులేదు అని నిరూపించుకున్నాడు. మైదానం నలువైపులా కూడా అద్భుతమైన షాట్లు ఆడి తన బ్యాటింగ్ తో మిస్టర్ 360 ప్లేయర్  అనే ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.
 అంతే కాదు ఇక భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఏడాది కాలంలోనే ఇక ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి ఇక సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.  ఇక అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా పేరు ఉన్న విరాట్ కోహ్లీ సైతం సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ పై ఆశ్చర్యపోయి ఏకంగా అతని బ్యాటింగ్ వీడియో గేమ్ లాగా ఉంటుంది అంటూ ప్రశంసలు కురిపించాడు.

 ఇకపోతే ఇటీవల ఇక ఇదే విషయంపై సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ విరాట్ కోహ్లీ తనను పొగిడిన తీరు గురించి గుర్తు చేసుకున్నాడు. ఒక మ్యాచ్ సమయంలో తాను విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేస్తుంటే  జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని  సూర్యకుమార్ యాదవ్ గుర్తు చేసుకున్నాడు అని చెప్పాలి. విరాట్ భాయ్ తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో అతను నా దగ్గరికి వచ్చి వీడియో గేమ్ ఆడుతున్నావా.. నీ బ్యాటింగ్ వేరే లెవెల్ అంటూ కామెంట్ చేశాడు. కోహ్లీ నుంచి అలాంటి ప్రశంస అందుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది అంటూ సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: