FIFA: ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాకయ్యిద్ది?

Purushottham Vinay
ఇక ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ 2022 చివరి దశకు చేరుకుంది.ఆదివారం నాడు (మరి కాసేపట్లో) జరిగే ఫైనల్ పోరుతో ఈ ప్రపంచకప్ మహా సంగ్రామానికి తెరపడనుంది. టైటిల్ ఫైట్ లో డిఫెండింగ్ చాంపియన్  అయిన ఫ్రాన్స్ తో లియో మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా  తలపడనుంది. ఇంకా ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి గం. 8.30లకు ప్రారంభం కాబోతుంది. ఇక బలబలాల విషయంలో ఇరు జట్లు కూడా సమంగా కనిపిస్తున్నాయి. ఇంకా అర్జెంటీనాకు కెప్టెన్ మెస్సీ ప్రధాన బలం. అయితే ఫ్రాన్స్ మాత్రం తక్కువేమి కాదు. చాలా సమష్టిగా ఆడుతుంది.అయితే ఫైనల్ లో మెస్సీ వర్సెస్ ఎంబాపేల మధ్య పోరు కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మెగాటోర్నీ ప్రైజ్ మనీ తెలిస్తే ఖచ్చితంగా కూడా షాకవ్వడం గ్యారెంటీ. అన్ని జట్లకు కూడా కలిపి దాదాపు రూ.2000 కోట్లకు పైగానే కేటాయించింది ఫిఫా.


ఇక, మెగాటోర్నీలో గెలిచిన విజేతకు మొత్తం రూ. 347 కోట్లు ప్రైజ్ మనీగా లభించనుంది. ఇక అలాగే రన్నరప్ కు రూ.248 కోట్లు బహుమతిగా దక్కుతాయి.ఇంకా అలాగే మూడో స్థానం దక్కించుకున్న క్రొయేషియా రూ.223 కోట్లు సొంతం చేసుకోనుంది. ఇంకా నాలుగో స్థానంలో నిలిచిన మొరాకో జట్టు మొత్తం రూ.206 కోట్లు అందుకోనుంది.ఇక, క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయి ఇంటి దారి పట్టిన బ్రెజిల్, నెదర్లాండ్స్, పోర్చుగల్ ఇంకా ఇంగ్లండ్ రూ.140 కోట్ల చొప్పున అందుకోనున్నాయి. అలాగే ప్రిక్వార్టర్స్ లో ఇంటి ముఖం పట్టిన అమెరికా, సెనెగల్, ఆస్ట్రేలియా, పోలెండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జపాన్ ఇంకా అలాగే దక్షిణ కొరియాలకు రూ.107 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ అనేది లభించనుంది.ఇక ఇప్పుడు మెస్సీపైనే అందరి దృష్టి నెలకొంది.ఇంకా ఈ దిగ్గజ ఆటగాడికి ప్రపంచకప్ మాత్రం ఓ కలగానే మిగిలిపోయింది. ఈ మెగా టోర్నీయే తనకు లాస్ట్ అని మెస్సీ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో, మెగాటోర్నీని కైవసం చేసుకుని ఎంతో సగర్వంగా నిష్క్రమించాలన్నది లియో మెస్సీ కోరిక.అతని ఫ్యాన్స్ కూడా అదే ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: