అతని కంటే అక్షర్ బెటర్.. చాన్స్ ఇవ్వండి : వసీం జాఫర్

praveen
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది అనుకుంటే మొదటి మ్యాచ్ లోనే ప్రేక్షకులు అందరిని కూడా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. ఎంతో పటిష్టంగా ఉన్న భారత జట్టు అటు బలహీనమైన బంగ్లాదేశ్ ను ఓడించలేకపోయింది. ఒకానొక  సమయంలో టీమిండియా విజయం సాధిస్తుంది అనుకున్నప్పటికీ ఇక భారత ఆటగాళ్లు చేసిన తప్పిదాల కారణంగానే చివరికి ఓటమిపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే నేడు బంగ్లాదేశ్ తో రెండో వన్డే మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి వన్డే మ్యాచ్ జరిగిన అదే వేదికపై రెండు వన్డే మ్యాచ్ కూడా జరుగుతుంది అని చెప్పాలి. అయితే మొదటి వన్డే మ్యాచ్ లో ఓటమితో  ఇక ఇప్పుడు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మాత్రం రెండో వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తప్పులను పునరావృతం చేయకుండా ఉండేందుకు.. జట్టులో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

 ఈ క్రమం లోనే జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయం పై భారత మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయం పై స్పందించిన భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండో వన్డే మ్యాచ్లో కుల్దీప్ సేన్ స్థానంలో అక్షర పటేల్ ను తీసుకోవాలని సూచించాడు. వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని అక్షర పటేల్ కు ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ పిచ్ లపై స్పిన్నర్లు అద్భుతం చేయగలరని ఇక షకీబ్ అల్ హసన్ విషయంలో ఇది నిరూపితమైందని.. అందుకే అక్షర్ కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: