రెండో వన్డే మ్యాచ్.. టీమిండియా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్?

praveen
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు అక్కడ వరుసగా సిరీస్ లు ఆడుతుంది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో హోరాహోరీగా తలబడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టి20 సిరీస్ ఆడిన టీమిండియా 1-0 తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్ లో బరిలోకి దిగింది.  ఈ క్రమంలోనే హోరాహోరీగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ధావన్ సేన పోరాడి ఓడింది అని చెప్పాలి  అయితే మొదటి మ్యాచ్లో ఓటమితో న్యూజిలాండ్ ఆధిక్యం సాధించింది.  ఈ క్రమంలోనే సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే మాత్రం రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు తప్పనిసరిగా విజయం సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ గురించి అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 ఇదిలా ఉంటే.. ఇక హోమిల్టన్ వేదికగా నేడు ఇండియా న్యూజిలాండ్ మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరుగుతూ ఉండగా.. ఈ మ్యాచ్ జరగడం మాత్రం ప్రస్తుతం అనుమానంగానే కనిపిస్తుంది అని చెప్పాలి.  ఎందుకంటే గత కొంతకాలం నుంచి న్యూజిలాండ్ లోని పలు ప్రాంతాలలో వరుసగా వర్షం కురుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ వర్షం కారణంగా టి20 సిరీస్ లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు రెండో వన్డే మ్యాచ్ లో కూడా 91% వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు ఎంతో కీలకమైన రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి ఛాన్స్ ఉందని తెలిసి టీమిండియా ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: