చేసింది తప్పు.. అయినా ఎంపైర్ ని బూతులు తిట్టాడు?

praveen
ఆస్ట్రేలియా స్పిన్నర్ అస్టన్ అగర్ ఇటీవల బౌండరీ వద్ద అసమాన్యమైన ఫీలింగ్ చేసి వార్తల్లో నిలిచి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఏకంగా ఫీల్డ్ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగి బూతులు తిట్టి వార్తల్లో నిలిచాడు  అగర్. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కవ్వింపులకు పాల్పడటంలో  ఎప్పుడూ ముందుంటారు అని ప్రపంచ క్రికెట్ పండితులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రత్యార్థులను ఎప్పుడు స్లెడ్జింగ్ కు పాల్పడుతూ ఏకాగ్రతను దెబ్బతీయడం లాంటివి చేస్తూ ఉంటారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. అయితే ఇలా ఇప్పుడు వరకు ఎంతో మంది ప్లేయర్లు మైదానంలో ఉన్న ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడటం లాంటివి చాలా సార్లు చూసాం.

 కానీ చాలామంది ఆటగాళ్లు అంపైర్ల జోలికి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు.. ఎందుకంటే నిబంధనలు ఉల్లంఘించినట్లు ఐసిసి భావిస్తే చివరికి పెనాల్టీ వేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే అంపైర్ల జోలికి అసలు పోరు. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా స్పిన్నర్ మాత్రం ఎంపైర్ను బూతులు తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఇది చోటు చేసుకోవడం గమనార్హం. అయితే క్రీజులో కుదురుకున్న డేవిడ్ మలాన్, సామ్ బిల్లింగ్ జోడిని విడదీయడానికి  కెప్టెన్ అస్టన్ అగర్ చేతికి బంతిని ఇచ్చాడు. అయితే అతను బంతితో విక్కెట్లు తీయాల్సింది పోయి బౌలింగ్ వేసిన తర్వాత పదే పదే పిచ్ పైనకు వస్తు బ్యాట్స్మెన్లను పరుగులు తీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన ఫీల్డ్ ఎంపైర్ పాల్ రీఫిల్ అగర్ ను హెచ్చరించాడు. పదేపదే పిచ్ పై పరిగెత్తడం కరెక్ట్ కాదు అనడం స్టంప్ మైక్ లో రికార్డ్ అయింది.

 దీంతో అంపైర్ వ్యాఖ్యలపై స్పందించిన అగర్ మీరు అనేది ఏంటి.. నేను బంతిని అంచనా వేయడానికి మాత్రమే పరిగెడుతున్న అంటూ సమాధానం ఇచ్చాడు.. దీంతో వెంటనే స్పందించిన అంపైర్ బ్యాటర్ బంతిని కొట్టింది ఆఫ్ సైడ్ నువ్ పిచ్ పైకి ఎందుకు వస్తున్నావ్ అంటే బ్యాట్స్మెన్ను అడుక్కోవడానికి కదా అంటూ తెలిపాడు. అయితే ఇది విన్న అస్టన్ అగర్కోపంతో ఊగిపోయాడు. అంపైర్ మీదకు దూసుకొచ్చి అసభ్యకరమైన పదంతో దూషించాడు. ఇదంతా స్టంప్ మైక్ లో రికార్డ్ అయింది. కాసేపు అస్టన్ అగర్ ఎంపైర్ మధ్య వాగ్వాదం జరిగింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: