వావ్.. బిల్డప్ బాబాయ్ సెంచరీ చేశాడు?

praveen
సాధారణంగా ఐపీఎల్లో ఎంతోమంది ఆటగాళ్లు చోటు దక్కించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక అరుదైన రికార్డులను కూడా క్రియేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టులో చోటు దక్కించుకున్న  రియాన్ పరాగ్ మాత్రం తన ఆట తీరుతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయలేదు. కానీ తన బిల్డప్ తో మాత్రం ఐపీఎల్ బిల్డప్ బాబాయ్ అంటూ ఒక విచిత్రమైన బిరుదును క్రికెట్ ప్రేక్షకుల నుంచి సంపాదించుకున్నాడు. ఏకంగా సరైన ప్రదర్శన చేయకపోయినప్పటికీ మాత్రం ఎక్కువ బిల్డప్ లకి పోతాడు అంటూ అంటూ ఏకంగా ఐపీఎల్ సమయంలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత అతని గురించి మాట్లాడుకోవడం అందరూ మానేశారు. కానీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ ఐపిఎల్ బిల్డప్ బాబాయ్. అయితే ఈసారి ఓవరాక్షన్ తో కాదు తన అద్భుతమైన ప్రదర్శనతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం దేశవాళి టోర్ని అయిన విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఇటీవలే రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అంతేకాదు లిస్టు ఏ క్రికెట్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు అని చెప్పాలి. 84 బంతులు ఎదుర్కొన్న రియాన్ 10 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 117 పరుగులు చేసి తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.

 తొలుత టాస్ ఓడిన అస్సాం 46.5 ఓవర్లలో 271 పరుగులు చేసింది.. ఇందులో రియాన్ పరాగ్ చేసింది 117 పరుగులు కావడం గమనార్హం. ఇక రియాన్ పరాగ్ తర్వత టాప్ స్కోరర్ గా ముక్తర్ హుస్సేన్ ఉన్నాడు   అయితే 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టును అస్సాం బౌలర్లు ఎంతో కట్టడి చేశారు. దీంతో రాజస్థాన్ జట్టు ఏకంగా 128 అరుగులకు ఆల్ అవుట్ అయింది. తద్వారా ఇక అస్సాం 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం గమనార్హం. ఇక ఈ విషయం తెలిసి ఏమో అనుకున్నామ్ కానీ బిల్డప్ బాబాయ్ లో కూడా మంచి ప్రతిభ దాగి ఉంది అంటూ ఎంతోమంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: