మహమ్మద్ షమీ కౌంటర్ పై.. షోయబ్ అక్తర్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ గెలుస్తుంది అనుకున్న టీమ్ ఇండియా జట్టు సెమీఫైనల్ వరకు దూసుకుపోయి ఇక సెమి ఫైనల్లో మాత్రం ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే ఇక కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టకుండా లీగ్ దశ నుంచి ఇంటి దారి పడుతుంది అనుకున్న పాకిస్తాన్ అనూహ్యంగా సెమీఫైనల్ లో అడుగుపెట్టడం ఇక ఆ తర్వాత సెమి ఫైనల్ లో న్యూజిలాండ్  ను ఓడించి ఫైనల్ కు దూసుకుపోవడం జరిగింది. అయితే ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్స్ సృష్టిస్తున్నారు.

 ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి సైతం ఇండియా పై సెటైర్ వేస్తూ బిలియన్ డాలర్ల జట్టు ఇంటికి వెళ్లిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే సమయంలో భారత మాజీ ఆటగాళ్ళు కూడా పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ చేసిన విమర్శలకు కౌంటర్లు ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవలే షోయబ్ అక్తర్ మాట్లాడుతూ టీమిండియా లాగా తమది చేతకాని బౌలింగ్ కాదని.. పాకిస్తాన్ తో జాగ్రత్త అంటూ ఫైనల్ కు ముందు ఇంగ్లాండ్ ను హెచ్చరించాడు. అయితే ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది.

 దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీమ్ ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ కౌంటర్ ఇచ్చాడు. సారీ బ్రదర్.. కర్మ అంటే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. అయితే ఇదే విషయంపై స్పందించిన షోయబ్ అక్తర్ కామెంటెటర్ హర్ష బోగ్లే పాకిస్తాన్ బౌలింగ్ ను ప్రశంసిస్తూ చేసిన పోస్టును ప్రస్తావించాడు. పాకిస్తాన్ 137 రన్స్ మాత్రమే చేసినప్పటికీ బౌలింగ్ బాగా చేసింది లక్ష్యాన్ని కాపాడుకునేందుకు మంచి ప్రదర్శన కనబరిచింది. పాక్ ది బెస్ట్ బౌలింగ్ టీం అంటూ హర్ష భోగ్లె ప్రశంసలు కురిపించగా.. ఇక ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు షోయబ్ అక్తర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: