వావ్ సూపర్.. తిలక్ వర్మ సెంచరీ కొట్టాడోచ్?

praveen
తిలక్ వర్మ.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోలేరు అని చెప్పాలి. ఎందుకంటే  తెలుగు క్రికెటర్ గా ఐపీఎల్లో ఛాంపియన్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ తో  అందరిని ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ ఏడాది జరిగినా ఐపీఎల్ సీజన్లో ఒకవైపు అప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లు అందరూ కూడా పేలవ ప్రదర్శనతో చేతులెత్తేస్తున్న సమయంలో క్రికెట్లో అప్పటివరకు పెద్దగా అనుభవం లేని కుర్రాడు తిలక్ వర్మ మాత్రం ఎంతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పటికీ తిలక్ వర్మ మంచి ఇన్నింగ్స్ మాత్రం అందరిని ఆకట్టుకుంది.

 ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఫ్యూచర్ టీమ్ ఇండియా స్టార్ అని ఇక అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయ్యారు అని చెప్పాలి. అయితే కేవలం ఐపిఎల్ లో మాత్రమే కాదు ఆ తర్వాత జరుగుతున్న దేశవాళీ టోర్నీలలో కూడా తిలక్ వర్మ తన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక కొన్ని కొన్ని సార్లు బౌలింగ్ కూడా చేస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో భాగంగా హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఏకంగా సెంచరీ తో అదరగొట్టేసాడు. 106 బంతుల్లోనే 132 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు మూడు సిక్సర్లు ఉండడం గమనార్హం.

 ఒకరకంగా బౌలర్ల పై వీర విహారం చేశాడు అని చెప్పాలి. ఇక ఇలా తిలక్ వర్మ సెంచరీ చేయడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇక హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్న మరో ఆటగాడు రోహిత్ నాయుడు కూడా సెంచరీ తో అదరగొట్టాడు అని చెప్పాలి. 144 బంతుల్లో 156 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉండడం గవనార్హం. ఇలా హైదరాబాద్ జట్టులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు శతకాలతో చెలరేగిపోవడంతో ఇక హిమాచల్ ప్రదేశ్ పై ఏకంగా 17 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచి శుభారంభం చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: