షాకింగ్ : రేప్ కేసులో.. మరో క్రికెటర్ అరెస్ట్?

praveen
సాధారణంగా సినీ సెలెబ్రిటీలతో పోల్చి చూస్తే క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎవరైనా క్రికెటర్ కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది కేవలం నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అంతేకాదు ఇక క్రికెటర్లు ఎవరైనా నేరాలకు పాల్పడ్డారు అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం దాని గురించి చర్చించుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంక స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలక ఏకంగా ఒక అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసు ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 తన హోటల్ రూమ్ లో గుణతిలక తనపై అత్యాచారం చేశాడంటూ ఒక అమ్మాయి ఆరోపించడం.. ఇక సిడ్ని పోలీసులు గుణతిలకను అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగింది. అంతేకాదు శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం విధిస్తూ ఇక జట్టు నుంచి కూడా తప్పించింది అని చెప్పాలి. అయితే ఇక ఇలా గుణతీలకకు సంబంధించిన రేప్ కేసు గురించి అందరూ మర్చిపోక ముందే ఇక ఇప్పుడు మరో క్రికెటర్ రేప్ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

 మైనర్ పై అత్యాచారం చేసిన కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లమీ చానెను  ఇటీవల పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇలా రేప్ కేసులో అరెస్ట్ అయిన సందీప్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు ఇక జట్టు నుంచి కూడా తొలగిస్తున్నట్లు నేపాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అయితే ఇక ఇప్పుడు సందీప్ ను తప్పించడంతో నేపాల్ జట్టుకి కొత్త కెప్టెన్ గా రోహిత్ పౌడల్ ను నియమించింది. కాగా నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానే 2018- 20 మధ్య ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: