వరల్డ్ కప్ లో భారీ సిక్సర్.. ఎన్ని మీటర్లో తెలుసా?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే సిక్సర్లు ఫోర్లకు పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రపంచ క్రికెట్ దృష్టిని మొత్తం ఎంతగానో ఆకర్షిస్తున్న పొట్టి ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు.  ఇక ఇలాంటి విద్వాంసమే అటు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చెప్పాలి. క్రీజు లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా భారీగా పరుగులు చేయాల్సిన ఒత్తిడి ఉంటుంది. అందుకే రావడం రావడమే క్రీసులో కుదురుకోవడం కాదు ఏకంగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటారు బ్యాట్స్మెన్లు.

 ఇలా టి20 ఫార్మాట్లో అటు బ్యాట్స్మెన్ లకు బౌలింగ్ చేయడం అంటే ప్రతి బౌలర్ కి కూడా ఎంతో సవాలతో కూడుకున్నది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఎంతో మంది బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఈ క్రమంలోనే భారీగా సిక్సర్లు బాదుతూ రికార్డులు కూడా సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో ఒక అద్భుతమే జరిగింది అని చెప్పాలి. ఏకంగా ఈ ఏడాది వరల్డ్ కప్ లోనే ఒక భారీ సిక్సర్ నమోదయింది.

 ఏకంగా 106 మీటర్ల భారీ సిక్సర్ నమోదు కావడం గమనార్హం. ఇలా రికార్డు సృష్టించిన ఈ సిక్సర్ ను బాధింది  ఎవరో కాదు పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ ఇఫ్తీకార్ అహ్మద్ కావడం గమనార్హం . ఇటీవల జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఎంగిడి వేసిన 16వ ఓవర్ నాలుగవ బంతిని ఇఫ్తికర్ అహ్మద్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ఇక ఇది ఏకంగా 106 మీటర్లు వెళ్లడం గమనార్హం. అయితే అంతకుముందు భారత్ పై డేవిడ్ మిల్లర్ 14 మీటర్ల సిక్స్ కొట్టగా ఇదే ఈ ఏడాది వరల్డ్ కప్ లో భారీ సిక్సర్ గా ఉండగా. ఇక ఇప్పుడు పాకిస్తాన్ బ్యాట్ నూ ఇఫ్తికర్ అహ్మద్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: