రోహిత్ శర్మ దారుణ వైఫల్యం.. బంగ్లా మ్యాచ్ లో 2 పరుగులకే అవుట్ !

VAMSI
ఈ రోజు టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా కీలకమైన మ్యాచ్ బంగ్లాదేశ్ మరియు ఇండియా ల మధ్యన జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలవడం ఇరు జట్లకు చాలా ప్రధానమని తెలిసిన విషయమే. గెలిచిన జట్టు సెమీస్ కు అతి దగ్గరగా వెళుతుంది. కాగా మొదట టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో రోహిత్ సేన బ్యాటింగ్ లో అద్భుతంగా ఆడి భారీ స్కోరు ను లక్ష్యంగా బంగ్లా ముందు ఉంచాలి..అప్పుడే విజయంతో పాటు మంచి రన్ రేట్ ను కూడా సొంతం చేసుకోగలుగుతారు. గత మూడు మ్యాచ్ లలో దారుణంగా ఫెయిల్ అయిన కే ఎల్ రాహుల్ కు సీనియర్ ల సలహా మేరకు టీమ్ యాజమాన్యం మరో అవకాశం కల్పించింది.
ఇక గత మ్యాచ్ లో వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఆడిన దీపక్ హూడను పక్కన పెట్టి అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇన్నింగ్స్ ఆరంభం అయ్యిన కాసేపటి తర్వాత ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడవ ఓవర్ లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో లెగ్ సైడ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడిన రోహిత్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి ఆడాడు.. కానీ అదృష్టవశాత్తూ ఆ బంతిని బంగ్లా ఫీల్డర్ ఒడిసి పట్టుకోవడంలో  ఫెయిల్ అయ్యాడు. దీనితో భారత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మాములుగా అయితే రోహిత్ కు ఎప్పుడైనా లైఫ్ లభిస్తే భారీ స్కోరు చేస్తాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అలాంటి మెరుపులు ఏమీ కనబడలేదు.
ఇన్నింగ్స్ నాలుగవ ఓవర్ లో రోహిత్ మహమ్మద్ హాసన్ బౌలింగ్ లో పాయింట్ దిశగా ఆడేందుకు ప్రయత్నించి యాసిర్ అలీ కి క్యాచ్ ఇచ్చాడు. దీనితో భారత్ అభిమానాలు తీవ్ర నిరాశ చెందారు. వరల్డ్ కప్ లో జరిగిన నాలుగు మ్యాచ్ లలో రోహిత్ ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే రాణించాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో 4 పరుగులు. నెదర్లాండ్ తో 53 పరుగులు, సౌత్ ఆఫ్రికాతో 15 పరుగులు మరియు ఈ రోజు బంగ్లాతో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా ఒక ఛాంపియన్ బ్యాట్స్మన్ ఈ స్థాయిలో వరల్డ్ కప్ లాంటి లీగ్ లో నాలుగు మ్యాచ్ లలో 74 పరుగులు చేయడం తగదు. మరి ముందు ముందు అయినా బాగా ఆడి కప్ ను అందిస్తాడా చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: