పాకిస్తాన్ పై.. టీమిండియా పగబట్టింది : షోయబ్ అక్తర్

praveen
టి20 ప్రపంచ కప్ లో భాగంగా భారత జట్టు మొదటి ఓటమిని చవిచూసింది. వరుసగా పాకిస్తాన్ నెదర్లాండ్స్ పై విజయకేతనం ఎగరవేసిన టీమ్ ఇండియా అటు పటిష్టమైన దక్షిణాఫ్రికా చేతిలో మాత్రం ఓడిపోయింది అని చెప్పాలి. అయితే అటు టీమిండియా ఓటమి పాకిస్తాన్ కు కష్టాలను తెచ్చిపెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు మ్యాచ్ లలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇలాంటి సమయంలో భారత్ దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ జింబాబ్వేలపై గెలిచి ఆయా జట్ల పాయింట్లను బలహీనపరచాల్సి ఉంటుంది. అలా చేస్తేనే పాకిస్తాన్ కు సెమీస్ అవకాశాలు మెరుగు అవుతాయి అని చెప్పాలి. కానీ ఇప్పుడు టీమ్ ఇండియా ఓడిపోవడంతో పాకిస్తాన్ ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ అసహన వ్యక్తం చేశాడు. భారత జట్టు 4 వికెట్లు పడినప్పుడు అక్తర్ ఒక వీడియోని పోస్ట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. పాకిస్తాన్ కోసం టీమిండియా గెలవాలని నేను ఒక వీడియోలో చెప్పాను. కానీ దక్షిణాఫ్రికా తో భారత ఆటగాళ్లు తీరు చూస్తే మాత్రం పాకిస్తాన్ పతనం కోసమే ఆడుతున్నట్లుగా కనిపించింది. ఇప్పటికే నాలుగు వికెట్లు పోగొట్టుకున్నారు. ముందు జరగబోయేది తెలియడం అటు ఆవేదన వ్యక్తం చేశాడు.

 పాకిస్తాన్ మీద పగతోనే భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయారు అన్న విధంగానే షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి. కాగా దక్షిణాఫ్రికా తో జరిగిన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అయిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా సఫారీ బౌలర్ల దాటికి తక్కువ స్కోరులకే వెనదిరిగిన విషయం తెలిసిందే. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ చేదించింది. ఇక భారత్ ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: