పాకిస్తాన్ కెప్టెన్ గా.. బాబర్ ఓ చెత్త రికార్డు?

praveen
పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజం బ్యాటింగ్లో సృష్టించే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు జట్టును ముందుకు నడిపిస్తూనే మరోవైపు ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఇక భారీ స్కోరు చేస్తూ ఉంటాడు. తోటి ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ తో కలిసి భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తూ ఇక తన బ్యాటింగ్లో ఎప్పుడు పాకిస్తాన్ జట్టుకి వెన్నుముక్కల నిలబడుతూ ఉంటాడు అని చెప్పాలి. అలాంటి బాబర్  ఇక స్టార్ బౌలర్ల బౌలింగ్లో సైతం చెడుగుడు ఆడేస్తూ ఉంటాడు. కానీ ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే  వికెట్ కోల్పోయాడు.

 భారత బౌలింగ్ విభాగం దాటికి క్రీజులో నిలవలేకపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మొదట బాబర్ అజాం వికెట్ కోల్పోవడం.. ఆ తర్వాత మహమ్మద్ రిజ్వాన్ కూడా వికెట్ సమర్పించుకోవడంతో పాకిస్తాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి. ఇలా గోల్డెన్ డకౌట్ గా వికెట్ కోల్పోయిన బాబర్ ఒక అనవసరమైన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో భాగంగా స్టార్ బాట్స్మన్ బాబర్ అజాం ఖాతా తెలవకుండానే గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు. భారత యువ బౌలర్ అర్షదీద్ అద్భుతమైన బంతితో అతన్ని పెబిలియన్ పంపించాడు.  ఆ తర్వాత బాబర్ రివ్యూ తీసుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది అని చెప్పాలి.

 దీంతో ఒక చెత్త రికార్డును రికార్డును సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ ను సమం చేశాడు. ఇమ్రాన్ ఖాన్ తర్వాత ఏ ప్రపంచ కప్ లోనైనా సరే భారత్ పై ఖాతా తెరవకుండానే అవుటైన రెండవ పాకిస్తాన్ కెప్టెన్గా నిలిచాడు బాబర్. 1992లో వన్డే ప్రపంచ కప్లో ఐదు బంతులు ఆడిన ఇమ్రాన్ ఖాతా తెలవకుండానే రనౌట్ గాపెవిలియన్ చేరాడు. ఇక 30 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ లో భారత్ పై పాకిస్తాన్ కెప్టెన్ ఇలా డకౌట్ గా వెను తిరగడం గమనార్హం .ఇటీవలే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఈ ఉత్కంఠ భరితమైన పోరులో చివరికి భారత విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: