ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. రహానే డబుల్ సెంచరీ?

praveen
భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అజింక్య రహానే. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే బిరుదు కారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరం అయ్యాడు. అయితే కేవలం టెస్ట్ లకు మాత్రమే పరిమితమైన రహానే పేలవమైన ఫామ్ కారణంగా చివరికి టెస్టు జట్టులో కూడా స్థానం కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఎట్టిపరిస్థితుల్లో మళ్లీ అవకాశం దక్కించుకోవడమే లక్ష్యంగా అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెప్పాలి.

 మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ ముగిసిన ఐపీఎల్లో బాగా రాణించిన అజింక్యా రహానే జ్యోతి లో స్థానం దక్కుతుంది అని అనుకున్నాడు. కానీ ఐపీఎల్లో రాణించిన ఎంతోమంది యువ ఆటగాళ్లకు జట్టులో చోటు  దక్కింది.  కానీ సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే కు మాత్రం చోటు దక్కలేదు.. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా పేరున్న అజింక్య రహానే ఐపీఎల్ లో మంచి ఇన్నింగ్స్ ఆడటం చూసిన అభిమానులు మురిసిపోయారు అని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడమె లక్ష్యంగా సాగుతున్నాడు అజింక్య రహానే. ఇప్పుడు దేశవాళీ సీజన్ ను కూడా ఘనంగా ప్రారంభించాడు అనే చెప్పాలి.  నార్త్ ఈస్ట్ జోన్ తో జరుగుతున్న దులిప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో వెస్ట్ జోన్ బ్యాట్స్మెన్ అజింక్యా రహానే 264 బంతుల్లో 207 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి.

 ఇందులో ఆరు సిక్సర్లు 18 ఫోర్లు ఉండడం గమనార్హం. ఎన్నో రోజుల నుంచి ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అజింక్య రహానే డబుల్ సెంచరీతో సత్తా చాటడంతో అందరూ అతని గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు అని చెప్పాలి. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ 321 బంతుల్లో 228 పరుగులు చేసి మరో డబుల్ సెంచరీ సాధించాడు.. ఇందులో 22 కోట్లు మూడు సిక్సర్లు  ఉండడం గమనార్హం. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్ట్ జోన్ ఏకంగా రెండు వికెట్ల నష్టానికి 590 పరుగులు చేసింది అని చెప్పాలి. ఇదే మ్యాచ్లో ఓపెనర్ పృథ్వీ షా   121 బంతుల్లో 113 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: