ఐసీసీ నిర్ణయం అదుర్స్ : రికీ పాంటింగ్

praveen
2023 నుంచి 2027 మధ్య ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన ఫ్యూచర్ టూర్లను ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇదే విషయంపై చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన ఫ్యూచర్స్ షెడ్యూల్ గురించి స్పందిస్తున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కి సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఇప్పటి వరకు కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే జరిగింది.

 కానీ ఇప్పుడు మాత్రం ఈ నాలుగు మ్యాచ్ లను ఐదు మ్యాచ్ లుగా మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.  ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించారు.. ఆస్ట్రేలియా భారత్ మధ్య ఎక్కువ టెస్టు మ్యాచ్ లను చూడటానికి అభిమానులు ఇష్టపడతారని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ గొప్ప నిర్ణయం తీసుకుంది అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా 2004- 2005 ఆస్ట్రేలియా పర్యటన నుంచి నాలుగు టెస్ట్ మ్యాచ్లు జరిగేవి. ఇక 2010-2011 లో రెండు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఐసీసీ ప్రకటించిన 2023 - 27 జరగబోయే వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో 5 మ్యాచ్ లతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫి సిరీస్ లు జరగబోతున్నాయి.

 ఈ క్రమంలోనే స్పందించిన రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా భారత్ మధ్య మ్యాచ్ లను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారని భావిస్తున్న. కాబట్టి కచ్చితంగా ఇది మంచి నిర్ణయం. ఆస్ట్రేలియా భారత్ మధ్య సిరీస్ చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఫాస్ట్, బౌన్సి  వికెట్లను భారత జట్టు ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియా భారత్ కు వెళ్లినప్పుడు అక్కడ స్పిన్, రివర్స్ స్వింగ్ బౌలింగ్ ను ఎదుర్కొంటుంది. కాబట్టి ఆ వ్యత్యాసమే ఆటగాళ్లను కూడా చాలెంజింగ్ గా ఉంటుందని రికీ పాంటింగ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: