వావ్.. టెస్ట్ చరిత్రలో.. అరుదైన రికార్డు?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఫామ్ కోల్పోయి మైదానంలో బ్యాటింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇక అచ్చంగా ఇలాగే అటు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు గా పేరు సంపాదించుకున్న ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్  స్మిత్ కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బౌలర్లకు సింహస్వప్నం లా ఉండే స్టీవ్ స్మిత్ గత కొంతకాలం నుంచి మాత్రం మైదానంలో పెద్దగా రాణించలేక పోతున్నాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో కూడా ఈ స్టార్ ప్లేయర్ ను ఏ ప్రాంచైజీ పట్టించుకోకపోవడంతో అమ్ముడుపోని ఆటగాడిగా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

 అయితే ఇలా ఫామ్ కోల్పోయి స్టీవ్ స్మిత్ ఇబ్బందిపడుతున్నప్పటికీ అటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రం అతనికి వరుస అవకాశాలు ఇస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేస్తోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో మళ్ళీ మునుపటి ఫామ్ అందుకుని అరుదైన రికార్డును సాధించాడు స్మిత్.

 టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ చరిత్రలో కేవలం 87 మ్యాచ్ లు మాత్రమే ఆడి 28 సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన  స్మిత్ ఈ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ లిస్టులో చూసుకుంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ మన్ 29 సెంచరీలు చేసి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ మరో రెండు సెంచరీలు చేసి ఏకంగా ప్రపంచ రికార్డును తిరగ రాస్తాడు అని అభిమానులందరూ బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు స్మిత్ మళ్లీ ఫామ్లోకి రావడం.. సెంచరీతో అదరగొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: