'రాణి' లేకుండానే బరిలోకి.. ఎలా రాణిస్తుందో?

praveen
మరికొన్ని రోజుల్లో భారత  మహిళల హాకీ జట్టు ప్రపంచ కప్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే హాకీ ఇండియా సెలెక్టర్లు ప్రపంచ కప్ ఆడబోయే జట్టును ఇక అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.  ఇక ఈ జట్టు వివరాలు చూసిన తర్వాత ఒక్కసారిగా అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. కారణం భారత  మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ స్ట్రైకర్ రాణి రాంపాల్ పేరు కనబడక పోవటం గమనార్హం. స్టార్ ప్లేయర్ రాణి రాంపల్ ఫిట్నెస్  సమస్యలతో బాధపడుతున్న కారణంగానే ఆమెనూ పంచ కప్ ఆడబోయే హాకీ జట్టు నుంచి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత మహిళల  హాకీ జట్టులో సీనియర్ గోల్ కీపర్ గా ఉన్నా సవితా సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ప్రపంచ కప్లో బరిలోకి దిగబోతోంది అన్నది తెలుస్తుంది. అయితే తొడ కండరాల గాయం కారణంగా జట్టుకు దూరమైన రాణి రాంపల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు అనేది తెలుస్తుంది.  దీంతో ఆమెను ఎంపిక చేయలేదని హాకీ ఇండియా ఇటీవలే తెలిపింది. అయితే గత ఏడాది టోక్యో ఒలంపిక్స్ లో భారత మహిళల  హాకీ జట్టు తొలిసారి 4వ స్థానంలో నిలిచింది. భారత మహిళల జట్టు ఈ ఘనత సాధించడం వెనక రాణి రాంపల్ కీలకపాత్ర వహించింది.

 అయితే గాయం కారణంగా ఒలంపిక్స్   తర్వాత ఏ టోర్నీ ఆడలేదు రాణి రాంపల్. ఇటీవలే ప్రూ లీగ్ లో మొదటి నాలుగు మ్యాచ్ లకు ఎంపిక చేసిన పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో మ్యాచ్ లకు దూరం అయింది రాణి రాంపల్. దీంతో ఆమెను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించారు అన్నది తెలుస్తుంది. నెదర్లాండ్స్, స్పెయిన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల ప్రపంచ హాకీ టోర్నమెంట్ వచ్చే నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగబోతుంది.
 కాగా హాకీ ఇండియా ప్రకటించిన భారత మహిళల హాకీ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి :  సవిత (కెప్టెన్, గోల్‌కీపర్‌), దీప్‌ గ్రేస్‌ ఎక్కా (వైస్‌ కెప్టెన్‌), బిచూ దేవి, గుర్జీత్‌ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను, మోనిక, నేహా, జ్యోతి, నవ్‌జ్యోత్‌ కౌర్, సోనిక, సలిమా టేటే, వందన కటారియా, లాల్‌రెమ్సియామి, నవ్‌నీత్‌ కౌర్, షర్మిలా దేవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: