నీ ఓపికకు హ్యాట్సాఫ్ గురూ.. 567 నిమిషాలు బ్యాటింగ్ చేశాడు?

praveen
సాధారణంగా ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్లు ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తూ వుంటారూ. కాని కొన్ని కొన్ని  రికార్డులు మాత్రం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డు గురించి. శివ నారాయణ చందర్పాల్ కుమారుడు తేజ్ నారాయణ చంద్రపాల్ ఇటీవల ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన తండ్రి లాగానే తేజ్ నారాయణ చంద్రపాల్ కూడా సహనానికి ఓపికకు మారు పేరుగా మారిపోయి తన నటనతో ఆకట్టుకున్నాడు.. ప్రస్తుతం మాజీ క్రికెటర్ లను సైతం ఫిదా చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.

 తన తండ్రి లాగానే ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ అయిన తేజ్ నారాయణ చందర్పాల్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకున్నాడు. వెస్టిండీస్ లో నాలుగు రోజుల ఛాంపియన్షిప్ లో భాగంగా జమైకా తో జరిగిన మ్యాచ్ లో గయానా తరఫున ఆడాడు తేజ్ నారాయన్. ఈ క్రమంలోనే  అద్భుతమైన సెంచరీ చేశాడు. మే 25 నుండి 28 మధ్య జరిగిన ఈ మ్యాచ్లో గయానా తొలి ఇన్నింగ్స్ లో తేజ్ నారాయణ 425 బంతుల్లో 184 పరుగులు చేశాడు. అందులో 27 ఫోర్లు ఉండడం గమనార్హం. ఇక్కడ మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. అతను 567 నిమిషాలపాటు క్రీజు లో ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేయడం గమనార్హం.

 ఇలా అతను అద్భుతమైన బ్యాటింగ్ చేయడం కారణంగా 7 వికెట్ల నష్టానికి 584 పరుగులు చేయగలిగింది గయానా జట్టు. అయితే ఈ మ్యాచ్ ఆ తర్వాత డ్రా అయినప్పటికీ క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు మాత్రం  తేజ్ నారాయన్ మారథాన్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవలే టోర్నీలో భాగంగా బార్బడోస్ తో జరిగిన మ్యాచ్ లో 143 పరుగులు చేసి అదరగొట్టాడు.  ఇక ఇటీవల జమైకా తో జరిగిన మ్యాచ్ లో 184 పరుగులతో సత్తా చాటాడు అని చెప్పాలి. అతని ఇన్నింగ్స్ గురించి తెలిసి నీ ఓపికకు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: