చైనాలో కొత్త సంక్షోభం.. పాపం ఎంత కష్టం వచ్చింది?

praveen
కరోనా వైరస్ అనే బయో వెపెన్ ప్రయోగించి ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడిపోయేలా చేసి ఇక ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చైనా కుట్ర చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక చైనా అనుకున్నట్లుగానే అటు కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో ఎంత విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రరాజ్యమైన అమెరికా సైతం సంక్షోభంలో కూరుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక ప్రపంచం మొత్తం తిరగేసిన కరోనా వైరస్ మొన్నటికి మొన్న చైనాలో విజృంభించింది.

 ఒక్కసారిగా చైనాలో  భారీగా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఎన్నో ప్రధాన నగరాలలో కూడా కఠినమైన లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కేసులు తగ్గినప్పటికీ చైనాలో మాత్రం ఆర్థిక సంక్షోభం అంతకంతకూ పెరిగిపోతోంది అన్నది తెలుస్తుంది. కరోనా కారణంగా శాంతి బీజింగ్ లాంటి నగరాల్లో కఠినమైన లాక్ డౌన్  విధించడం కారణంగా కొంత ఆర్థిక సంక్షోభం ఏర్పడితే.. ప్రపంచ దేశాలకు చెందిన చైనా ఎన్నో అప్పులు ఇచ్చింది.

 ఇక కరోనా వైరస్ కారణంగా ఆయా దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రస్తుతం చైనా ఇచ్చిన అప్పులను మళ్లీ తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి ఆయా దేశాలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 36 బిలియన్ డాలర్లు చైనా నష్టం లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చైనాలోనే 46 నగరాలపై కరోనా వైరస్ ప్రభావం ఉన్న కారణంగా అతిపెద్ద సమస్య ఎదుర్కొంటుంది చైనా. ఈ క్రమంలోనే ప్రతినెల 46 బిలియన్ డాలర్ల సంక్షోభం ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ప్రకృతి విపత్తులు కూడా ఈ సంక్షోభానికి కారణం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ సంక్షోభం నుంచి చైనా ఎలా బయటపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: