ఐపీఎల్ : సూర్యకుమార్ స్థానంలో.. ముంబైలోకి ఎవరొచ్చారో తెలుసా?

praveen
ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత సారథ్యంలో మరింత అనుభవం సాధించిన రోహిత్ శర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ని మరింత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా విఫలం అయ్యాడు రోహిత్ శర్మ.
 కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఒక ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో రోహిత్ శర్మ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. వరుసగా మూడో ఓటమి చవిచూసిన ముంబై ఇండియన్స్ జట్టు ఇక ఈ ఏడాది ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా చెత్త రికార్డు  ఖాతాలో వేసుకుంది. ఇలా ఇప్పటికే వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ సతమతమవుతున్న సమయంలో జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా జట్టు కు దూరం కావడంతో మరింత షాక్ తగిలింది అని చెప్పాలి.

 సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ముంబై ఇండియన్స్ లో మిస్టర్ 360 గా పేరు సంపాదించుకున్న సూర్యకుమార్ యాదవ్  స్థానంలో మరో యువ ఆటగాడు ఆకాష్ మద్వాల్ ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కుడిచేతి ఫాస్ట్ బౌలర్ అయిన ఆకాష్ మద్వాల్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని చెప్పాలి. కాగా నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు  ముంబై ఇండియన్స్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది.. కాగా ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ పరుగుల తేడాతో తప్పక విజయం సాధించాల్సిందే. లేదంటే చివరికి ఐపీఎల్ నుంచి నిష్క్రమించి ఇంటి బాట పట్టడం ఒక్కటే  దారి. అదే సమయంలో ఇప్పటికీ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ కి ఓడినా గెలిచినాపోయేదేమీ లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: