వారెవ్వా చాహల్.. అరుదైన రికార్డు కొట్టేశాడుగా?

praveen
అతను ఫామ్ లో లేడు.. టీమిండియాలో అవకాశం ఇస్తే ఉపయోగించుకోలేడు. అతని టీమిండియా నుంచి పక్కన పెట్టటమే బెటర్.. అతడు వేసే స్పిన్ బౌలింగ్ లో పెద్దగా పస లేదు.. ఇక ఇలాగే సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ముందు యుజ్వేంద్ర చాహల్ గురించి అందరూ విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు విమర్శలు చేసినవాళ్లే ఇప్పుడు అతని పై ప్రశంసలు కురిపించ కుండా ఉండలేక పోతున్నారూ అని చెప్పాలి. అతడు బాగా రాణించడం లేదు అని బెంగళూరు జట్టు అతని వదిలేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతని సొంతం చేసుకుంది.

 పోటీపడి మరీ 6 కోట్లు వెచ్చించి అతని కొనుగోలు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే తనపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతున్నాడు చాహల్. తన స్పిన్ బౌలింగ్ తో మాయాజాలం సృష్టిస్తున్నాడూ. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి రాజస్థాన్ విజయాలతో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కూడా కొనసాగుతున్నాడు. ఇకపోతే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మరో అరుదైన రికార్డును సృష్టించాడు.

 ఒక సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు చాహల్. 2019లో 20 వికెట్లతో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు శ్రేయస్ గోపాల్.. ఇప్పుడు  చాహల్ దాన్ని అధిగమించాడు. ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మొత్తం ఐపీఎల్ సీజన్ లో ఇరవై రెండు వికెట్లు పడగొట్టి టాప్ లో కొనసాగుతున్నాడూ. నాలుగు ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఇలా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న చాహల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతన్ని ప్రపంచ కప్ లో సెలెక్ట్ చేయాలంటూ ఎంతోమంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: