కాశ్మీర్ పై.. పాక్ కొత్త ప్రధాని ఏమన్నాడో తెలుసా?

praveen
మొన్నటి వరకు ఇండియా పై దుమ్మెత్తి పోస్తూ పాకిస్తాన్ లో ప్రధానమంత్రి పదవిలో తన ప్రాబల్యాన్ని కొనసాగించిన ఇమ్రాన్ ఖాన్  చాప్టర్ ప్రస్తుతం క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఇక కోర్టు కూడా ఇమ్రాన్ ను ప్రధాన మంత్రి పదవినుంచి దిగిపోవాలని ఆదేశించడంతో.. చివరికి ప్రధానమంత్రి పదవి వదిలేసారు ఇమ్రాన్ ఖాన్. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా నవాజ్ షరీఫ్ వచ్చారు. ఇలాంటి సమయంలోనే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మరింత ఇబ్బందులకు గురి చేసేందుకు ఏకంగా దైవదూషణ కు పాల్పడ్డాడంటూ ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్.

అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ లో ఎలాంటి నిధులు లేకపోవడంతో ఇక ఇప్పుడు మిత్ర దేశాల అయినా సౌదీ అరేబియా దుబాయ్ ఇలాంటి దేశాల సహాయం కోరేందుకు సిద్ధమయ్యారు షరీఫ్. ఈ క్రమంలోనే ఆయా దేశాలలో పర్యటిస్తూ ఉన్నారన్న విషయం తెలిసిందే. సాధారణంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవిలో ఎవరు కొనసాగిన ఇక భారత్ విషయంలో ఏదో ఒకటి విమర్శ చేస్తే గాని హైలెట్ అవ్వరు. ఇక ఇప్పుడు కొత్తగా ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నవాజ్ షరీఫ్ కూడా ఇదే చేస్తున్నాడని తెలుస్తోంది.

ఆర్థిక సహాయం కావాలంటూ సౌదీ అరేబియా దుబాయ్ దేశాలను అడగడానికి వెళ్లిన పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇక అక్కడ పాకిస్తాన్ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు అని తెలుస్తోంది. భారత్లో ఉన్న కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్ కు చెందినదని ఈ విషయం లో కలుగజేసుకోవాలి అంటూ ఆయ దేశాలను కోరాడట కొత్త ప్రధాని నవాజ్ షరీఫ్. కానీ అటు సౌదీ అరేబియా దుబాయ్ దేశాలు భారత్ సంబంధాల నేపథ్యంలో ఇదంతా లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సాధారణంగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి స్థానంలో ఎవరున్నా భారత్ పై దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ప్రధానిగా ఎన్నికైన షాబాజ్ షరీఫ్ రానున్న రోజుల్లో భారత విషయంలో ఎలా వ్యవహరించ పోతున్నాడూ అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: