మొదటి విజయం తర్వాత.. రోహిత్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఇండియన్స్ ఎంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏడాది అద్భుతంగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగే ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం వరుస ఓటములతో సతమతమవుతూ వచ్చింది. మెగా వేలం కారణంగా జట్టు లో ఉన్న కీలక ఆటగాళ్లు దూరం కావడంతో చివరికి ముంబై ఇండియన్స్ కి గడ్డు పరిస్థితులు తప్పులేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఛాంపియన్ గట్టిగా కొనసాగిన ముంబై ఇండియన్స్ ఈసారి ఒక విజయాన్ని కూడా నమోదు చేయ లేక ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది.

 అయితే ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మొత్తం మూసుకుపోవడంతో కనీసం పరువు నిలబెట్టుకోవడానికి అయినా విజయం సాధించాలి అని అభిమానులు అనుకున్నారు. ఇక నిన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు కావడంతో నిన్న ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదటి విజయాన్ని నమోదు చేస్తే బాగుంటుంది అని అభిమానులు అందరూ ఎంతో ఆశపడ్డారు. ఈ క్రమంలోనే అనుకున్నట్లుగానే ముంబై ఇండియన్స్ 2022 ఐపీఎల్ సీజన్ లో బోణీ కొట్టింది . వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విజయం సాధించింది ముంబై.

 అంతేకాదు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు బహుమతి విజయం రూపంలో వచ్చింది అని చెప్పాలి. ఈ విషయంపై మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై గెలుపును ప్రత్యేకంగా భావిస్తాను అంటు చెప్పుకొచ్చాడు. తమలోని అసలైన ఆట ఇదే అంటూ తెలిపాడు. ఇక రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు అంటు ప్రశంసలు కురిపించాడు.మంచి ఏరియాలో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను కట్టడి చేసి తక్కువ స్కోరుకే పరిమితం చేశారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టు బ్యాట్స్మెన్లు  కూడా కలిసి కట్టుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు అంటూ రోహిత్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: