ట్విస్ట్ ఇచ్చిన మహిళా ఎస్సై.. అసలు విషయం ఏంటంటే?

praveen
ఇటీవల కాలంలో జనాలు మోసాలకు పాల్పడేందుకు ఎప్పుడూ కొత్త దారులను వెతుకుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఆమె ఎంతో బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ ఉంది. పాపం ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంది. ఇక ఉద్యోగాలు ఇప్పించాలి అంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా. కొన్ని లక్షల రూపాయల వరకూ యువకుల నుంచి తీసుకుంది. ఇటు కొన్నాళ్ళపాటు ఉద్యోగాలు ఇస్తాను అంటూ చెప్పింది. కానీ ఆ తర్వాత పత్తా లేకుండా పోయింది.

 దీంతో యువకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇక్కడ అసలు ట్విస్టు ఏమిటంటే సదరు మహిళ అసలు పోలీస్ కాదు కేవలం పోలీస్గా ప్రచారం మాత్రమే చేసుకుని మాయమాటలు చెప్పి లక్షల్లో వసూలు చేసి అందరికీ కుచ్చుటోపి పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్లో సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు పోలీస్ శాఖలో ఉద్యోగానికి ఆశపడి ఎస్సై గా పరిచయమైన మహిళకు పది లక్షలు ముట్ట చెప్పాడు. కానీ ఆ తర్వాత సదరు మహిళ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు నిందితురాలిని పట్టుకున్నారు.

 తీగ లాగితే డొంక కదిలినట్లు సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సమయంలో ఊహించని నిజాలు బయటపడ్డాయి. కేవలం సిద్దిపేట జిల్లాలో మాత్రమే కాదు మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలో పదుల సంఖ్యలో యువకులను మోసగించినట్లు విచారణలో తేలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన విజయ భారతి డిగ్రీ పూర్తి చేసి 2018 లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నారు. కానీ ఎంపిక కాలేదు. తర్వాత మహబూబాబాద్ కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది. చివరికి 13 లక్షలు ప్రియుడి కోసం అప్పు చేసి మోసపోయింది. ఇక అప్పులు తీర్చేందుకు ఎస్సే అవతారమెత్తింది. నకిలీ ఐడెంటి కార్డు.. ధ్రువపత్రాలు సృష్టించి ఎస్సైగా అందరినీ నమ్మించడం మొదలు పెట్టింది. చివరికి ఎట్టకేలకు ఇక నిందితురాలిని అరెస్ట్ చేశారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: