చాహల్ ను ప్రపంచ కప్ జట్టులో చూసే అవకాశం ఉంది...

M Manohar
టీ 20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో మణికట్టు-స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ని ఎంపిక చేయకపోవడం వెనుక సెలక్టర్ల కారణాలపై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డారు. 15 మంది సభ్యుల బృందంలో చాహల్‌ను చూడాలని తాను ఇప్పటికీ ఆశిస్తున్నానని హర్భజన్ చెప్పాడు. అయితే ఐసీసీ టోర్నమెంట్లో భారత జట్టును ప్రకటించిన ప్రతిసారి ఏదో ఒక వివాదం జరుగుతుంది. 2019 ప్రపంచ కప్ సమయంలో అంబటి రాయుడు ని ఎపిక చేయడాపోవడంలో వచ్చిన ఆరోపణలను బీసీసీఐ ఇప్పుడు ఇటువంటి యుజ్వేంద్ర చాహల్‌ విషయంలో ఎదుర్కొంటోంది. ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసే సమయంలో తాను యుజ్వేంద్ర చాహల్‌ గురించి చర్చించామని కానీ కానీ మాకు వేగంగా బంతులు వేసే స్పిన్నర్ కావాలని.. అందుకు తగ్గట్లుగా... వేగంగా బంతులు వేస్తుండటంతో రాహుల్ చహర్ అతని స్థానంలో తీసుకున్నామని బీసీసీఐ సెలక్టర్ చేతన్ శర్మ తెలిపారు. ఇక ఈ విషయంపై తాజాగా హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.... ''చాహల్ నువ్వు ఎప్పటిలాగే అత్యుత్తమ బౌలింగ్ చేస్తున్నావ్. దాన్ని అలాగే కొనసాగించి మరియు బౌలింగ్ చేసే సమయంలోనే వేగాన్ని నిర్ధారించుకో... దానిని ఎప్పటికీ తగ్గనివ్వకు. నిన్ను ప్రపంచకప్ జట్టులో చూడాలని ఆశిస్తున్నాను... నువ్వు ఛాంపియన్ బౌలర్ అని'' హర్భజన్ సింగ్ పోస్ట్ చేశారు. అయితే ఈ ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ లో యుజ్వేంద్ర చాహల్‌ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అద్భుతం గా రాణిస్తు జట్టు విజయాలలో కీలక పాత్రా పోషిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు తరపున 12 మ్యాచ్‌ ల్లో ఆడిన చాహల్ 14 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇప్పటి వరకు టీ-20 ఫార్మెట్ 63 అంతర్జాతీయ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు యుజ్వేంద్ర చాహల్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: