టీటీడీ అధికారులు.. ఆ భక్తుల మొర ఆలకించరా?

ఏ పుణ్యక్షేత్రంలోనైనా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించే వాళ్ళు, ప్రత్యేకించి ఆలయాలలో నిర్వహించేవాళ్లు సేవాభావంతో చెయ్యాలి అని కొంతమంది అంటున్నారు. సేవా భావంతో భక్తుల తరపున ఆలోచించి వాళ్లకు ఇబ్బంది లేకుండా, వాళ్ళ సంతోషపడేలా తమ ఉద్యోగాన్ని నిర్వహించాలని అంటున్నారు. కోవిడ్ సమయంలో కొన్ని దర్శనాలను క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే క్రౌడ్ ప్రాబ్లం వస్తుందని క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఆ దర్శనాలకు డబ్బులు కట్టినందుకైనా ఆ భక్తులకు తర్వాత అయినా దర్శనం ఇప్పించాలి కదా అని అడుగుతున్నారు. అయితే టీటీడీ బోర్డు ఇప్పుడు ఆ సేవలకు అనుమతించలేమని వారు బ్రేక్ దర్శనానికి రావచ్చని చెప్పారట. కొవిడ్ సమయంలో 2020 మార్చి 20-2021 ఏప్రిల్ 13 వరకు భక్తులను సేవలకు అనుమతించలేదు. స్వామికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించారు.

ఈ సమయంలో శ్రీవారికి సుప్రభాతం, అర్చన, అభిషేకం, విశేష పూజ, నిజ పాద సేవా దర్శనం, తోమాల, వసంతోత్సవం, తిరుప్పావడ సేవలను చూసేందుకు 17,764 మంది భక్తులు ముందస్తుగా పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే అప్పుడు క్యాన్సల్ అవ్వగా ఎదురుచూస్తున్న భక్తులకు తాజాగా ఈ కబురు చెప్పారు టీటీడీ బోర్డు వాళ్ళు. బ్రేక్ దర్శనం లేదా సొమ్ములు వాపస్ తీసుకోవచ్చని సూచించారు.

ఇందులో భాగంగా 8,965 మంది బ్రేక్ దర్శనం చేసుకోగా, 8,917 మంది ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. మామూలుగా రోజుకి 1000-500 టికెట్లు ఇస్తూ ఉంటే వీళ్ళకి కూడా ఒక 50 టికెట్లు ఇస్తే నెమ్మదిగా అందరికీ ఆ దర్శన భాగ్యం కలుగుతుంది కదా అని అంటున్నారు. కానీ దేవుడి తరపు నుండి భక్తుల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత మధ్యలో ఉద్యోగులకు ఉంటుందని వాళ్లు అంటున్నారు. దేవుడి దయ, కరుణ దేవుడి దర్శనాన్ని భక్తులకు అందించేలా చూసే బాధ్యత వీళ్ళదే. కానీ వాళ్లే ఈ దేవునికి భక్తునికి మధ్యన ఇబ్బందులు కలిగిస్తే ఎలా అని వాళ్ళు అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD

సంబంధిత వార్తలు: