ఈ పండుగ రోజున ఎలాంటి పనులు చేయాలి.. చేయకూడదు..!!

Divya
ఇక ఈ మాఘమాసం నెలలో బహుళ చతుర్థశీ రోజున మహా శివరాత్రి రానుంది. ఇక ఈ రోజున శివుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఆ పరమ శివుడు లింగరూపంలో ప్రజలకు దర్శనమిస్తాడని పురాణాలలో తెలియజేయడం జరిగింది. ఈశ్వరుడు నుంచి లింగరూపంలో కి మారే రోజును శివరాత్రిగా జరుపుకుంటారని పండితులు తెలియజేస్తున్నారు. ఇక భక్తులు కూడా ఎంతో నిష్టతో, భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి శివరాత్రి రోజున ఎలాంటి పనులు చేయాలి.. చేయకూడని పనులు ఏవో చూద్దాం.

శివరాత్రి రోజున మన పరిసరాలలో ఏదైనా శివాలయం ఉన్నట్లు అయితే వెళ్లి శివుడిని దర్శించుకోవాలి. శివుడికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. శివుడికి కేవలం నైవేద్యంగా పులిహోర ను మాత్రమే పెట్టాలట. అంతేకాకుండా పరమేశ్వరుడికి నైవేద్యంగా పంచామృతం ని మాత్రమే పెట్టాలని పురాణాల్లో తెలియజేయడం జరిగింది. ఇక పండుగ రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే లేచి తలకు స్నానం చేసి శివుడు పూజ చేయాలట. ఒకవేళ ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరైనా సరే మంచినీళ్లు కూడా తాగకూడదని ఎంతోమంది తెలియజేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి విషయం ఎక్కడ పురాణాలలో తెలియజేయలేదు. కాబట్టి అందుచేతనే పండ్లు, పాలు, నీళ్లు ఆహారంగా తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఈ రోజున ఎవరికైనా ధర్మాలు చేయాలి. పేదలకు అన్నదానం పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయట.

శివరాత్రి రోజు శివలింగాన్ని పూజించేటప్పుడు తులసి ఆకులతో పూజించకూడదు.. ఇక అంతే కాకుండా ప్యాకెట్ పాలతో కూడా శివుడిని అభిషేకం చేయకూడదు. అలా అభిషేకించే టప్పుడు శివుడు లింగం పైన వెంట్రుకలు కాని, చెమట చుక్కలు కానీ ఇక్కడ కూడదట. ముఖ్యంగా ఈ పండుగ రోజున స్మోకింగ్, ఆల్కహాలు వంటివి చేయడం పాపం. ఇక భార్యాభర్తలు ఇద్దరు ఈ రోజు కాస్త దూరంగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: