తాలిబన్‌ టు తాడేపల్లి.. పిచ్చెక్కిస్తున్న టీడీపీ..?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో విమర్శలు మామూలే.. అందులోనూ విపక్షం అంటేనే విమర్శలకు పెట్టింది పేరు.. అయితే ఆ విమర్శలు ప్రజాసమస్యలపై, వాస్తవాల ఆధారంగా ఉంటే.. అది ప్రజోపయోగం అవుతుంది.. కానీ.. విమర్శలు చేయాలి కాబట్టి చేస్తాం.. లేకపోతే.. విపక్షం కాబట్టి ఏదైనా విమర్శిస్తాం అన్నట్టు సాగితే.. ఆ విమర్శలను నమ్మే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం తీరు అలాగే ఉంది.

గుజరాత్ డ్రగ్స్ కుంభకోణం అంశాన్ని ఎలాగైనా జగన్‌కు అంటగట్టాలని చూస్తున్న టీడీపీ.. అందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. నిన్న కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి... పోర్టు ద్వారా మాదక ద్రవ్యాలు దిగుమతి చేస్తున్నారని తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణలు. పెద్ద దుమారమే రేపాయి. ఇటీవల కాకినాడలో తగలబడిన ఓ బోటులో మాదకద్రవ్యాలు ఉన్నాయన్న టీడీపీ ఆరోపించింది. దీంతో మత్స్యకారులతోపాటు,ఎమ్మెల్యే మద్దతుదారులు తెలుగుదేశం కార్యాలయం ముట్టిడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.

ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ పోర్టు నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికా దేశాల నుంచి మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకుంటున్నారని తెలుగుదేశం నేత పట్టాభి అంటున్నారు. పార్టీ నేతలతో  కలిసి ఆయన పోర్టును సందర్శించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయన్నారు. కాకినాడలో ఇటీవల తగలబడిన బోటులో మాదకద్రవ్యాలు ఉన్నాయంటూ పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి.

స్థానిక మత్స్యకారులు, ఎమ్మెల్యే అనుచరులు కాకినాడలోని తెలుగుదేశం కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఒకదశలో టీడీపీ నేతలపై దాడికి యత్నించారు. చివరకు పోలీసులు వారిని నిలువరించారు ఆ తర్వాత మత్స్యకారులతో తెలుగుదేశం నాయకులు చర్చించారు. మత్స్యకారులను ఉద్దేశించి తాము ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పడంతో వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. వైసీపీ శ్రేణులు మాత్రం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారందరినీపంపించివేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇలా మొత్తానికి డ్రగ్స్ వ్యవహారాన్ని వైసీపీకి అంటగట్టాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: