తెలంగాణ: మాకూ ఒక 'బంధు' కావలెను..!

Chakravarthi Kalyan
తెలంగాణలో ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పదం బంధు.. అవును.. ఈ బంధు ఏంటి అంటారా.. రైతు బంధు, దళిత బంధు.. ఇలాగన్నమాట.. రైతు బంధు దేశంలోనే చర్చకు దారి తీసిన పథకం.. కేసీఆర్ ఆలోచనలు కొన్ని ఇలాగే ఉంటాయి. దేశంలో ఏ నేత కూడా ఆలోచించిన రీతిలో ఆయన ఆలోచిస్తారు.. దాన్నే ఆయన భాషలో చెప్పాలంటే.. నాయకుడికి కల్పన ఉండాలి.. అలా కొన్నేళ్ల క్రితం రైతు బంధు ప్రకటించి దాన్ని అమలు చేస్తున్న కేసీఆర్.. కొన్ని రోజుల క్రితం దళిత బంధు ‌ప్రకటించి సంచలనం సృష్టించారు.
అసలు దేశంలో ఏ నాయకుడూ ఆలోచించడానికి కూడా సాహసించని స్థాయి పథకం అంది. ఏకంగా ఒక్క కుటుంబానికి అక్షరాలా పది లక్షల రూపాయల నగదు పంపిణీ చేయడం.. అంటే మామూలు విషయం కాదు.. అందుకే ఈ దళిత బంధు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఇది ఎంత సంచలనం సృష్టించిందో అంత వివాదాస్పదమూ అవుతోంది. నిజమే.. వెనుక బడిన వాళ్లను ఆదుకోవాల్సిందే.. సమ సమాజం దిశగా అడుగులు పడాల్సిందే.

అయితే.. ఆ అడుగుల్లో పక్షపాతం ఉన్నట్టు కనిపించ కూడదు. దళితులు వెనుకబడి ఉన్నారన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు.. కానీ.. అదే స్థాయిలో గిరిజనలూ వెనుకబడే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ముస్లింలదీ అదే పరిస్థితి.. అలాగే చెప్పుకోవడానికి బీసీలుగా ఉన్నా.. దళితులకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వివక్ష ఎదుర్కొంటున్న కొన్ని ఎంబీసీ కులాలూ ఉన్నాయి. అలాంటిది కేవలం ఎస్సీలకు మాత్రమే అది కూడా ఏకంగా పది లక్షలు ఇస్తామని ప్రకటించడం మిగిలిన వెనుకబడిన వర్గాల్లో కలవరం కలిగిస్తోంది.

అందుకే ఇప్పుడు కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. గిరిజన నేతలు.. గిరిజన బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ నేతలు బీసీ బంధు ఇవ్వాలని కోరుతున్నారు. ముస్లిం నేతలు ముస్లిం బంధు అడుగుతున్నారు. ఇలా అన్ని వెనుకబడిన  వర్గాలు ఇప్పుడు బంధు కోరుతున్నాయి.  మరి కేసీఆర్ ఎన్ని వర్గాలకు ఈ బంధులు ఇవ్వగలడు.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: