హెరాల్డ్ సెటైర్ : సబ్బం దెబ్బకు పరువు పోగొట్టుకున్న చంద్రబాబు

Vijaya
అనవసరంగా సంబంధం లేని విషయాల్లో  తలదూర్చినందుకు చంద్రబాబునాయుడుకు బాగానే అయ్యింది.  జగన్మోహన్ రెడ్డిపై నోరుపారేసుకోవటానికి  ఏ చిన్న అవకాశం వస్తుందా అని చంద్రబాబు ఎదురుచూస్తుంటాడు. ఘటనతో నిజంగానే జగన్ కు సంబంధం ఉందా లేదా అన్నది కూడా చూడడు. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగానే ఉంటోంది జగన్ విషయంలో చంద్రబాబు యవ్వారం. తాజాగా విశాఖ నగరంలో సబ్బం హరి ఇంటి కాంపౌండ్ వాల్ ను జీవీఎంసి అధికారులు కూల్చేశారు. దాంతో సబ్బం ఒళ్ళుమరచిపోయి నోటికొచ్చిన బూతులన్నింటినీ ప్రయోగించేశాడు.  సబ్బం పూనకాన్ని చూసిన  చంద్రబాబుకు కూడా  రెచ్చిపోయి ప్రభుత్వాన్ని, జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడేశాడు.  తీరా చూస్తే ఆవేశం తగ్గిపోగానే తానేం మాట్లాడాడో సబ్బంకు అర్ధమైఉంటుంది. అందుకనే భేషరతుగా జగన్ కు ఉన్నతాధికారులకు క్షమాపణలు చెప్పుకున్నాడు.



సీన్ కట్ చేస్తే బూతులు తిట్టిన సబ్బం క్షమాపణ చెప్పుకున్నాడు బాగానే ఉంది. మరి సబ్బంను చూసి అవసరం లేకపోయినా ఆవేశాన్ని తెచ్చుకుని ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు సంగతేంటి ? ఇక్కడ విషయం ఏమిటంటే సబ్బం మున్సిపల్ పార్కు స్ధలం 200 గజాలను ఆక్రమించేసుకున్నాడు. స్ధలాన్ని ఆక్రమించేసుకున్న సబ్బం అందులో టాయిలెట్లు కట్టుకున్నాడు.  విశాఖ మేయర్ గాను ఎంపిగా చేసిన సబ్బంకు తాను చేస్తున్నది తప్పని బాగా తెలుసు. తెలిసీ ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంతకాలం ఎంతమంది ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం  పట్టించుకోలేదు. ఎందుకంటే పదేళ్ళు సబ్బమే ప్రజాప్రలినిధిటా ఉన్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన కారణంగా అధికార వ్యవస్ధ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. 2014లో  విభజన తర్వాత సబ్బం అధికార టీడీపీలో చేరాడు కాబట్టి సబ్బం జోలికి ఎవరు వెళ్ళలేదు.



సీన్ కట్ చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వానికి కూడా సబ్బం ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయి.  దాంతో అన్నీ విషయాలపైనా విచారణ జరిపించిన ప్రభుత్వం ఆక్రమణలపై నోటీసులిచ్చింది. నోటీసులను తీసుకోవటానికి సబ్బం రెజెక్ట్ చేయటంతో  దాన్ని ఇంటికి అంటించేశారు. మరుసటి రోజే అంటే శనివారం తెల్లవారే కాంపౌండ్ ను  కూల్చేశారు. తాను ఆక్రమించుకున్న స్ధలాన్ని మున్సిపాలిటీ తిరిగి స్వాధీనం చేసుకోవటాన్ని సబ్బం తట్టుకోలేకపోయాడంటే అర్ధముంది.  మరి చంద్రబాబుకు ఏమైంది ?  గుడ్డిగా సబ్బంను సమర్ధించటమేనా ?  ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించుకున్న సబ్బంకు గడ్డిపెట్టాల్సిన చంద్రబాబు తన స్ధాయిని తానే దిగజార్చుకున్నట్లయ్యింది.



హోలు మొత్తం మీద ట్విస్టు ఏమిటంటే తాను అనవసరంగా ఆవేశపడి జగన్+ఉన్నతాధికారులను తిట్టినందుకు సబ్బం క్షమాపణలు చెప్పుకోవటమే.  ఇదొక కేసే కాదు చాలా విషయాల్లో  చంద్రబాబు ఇలాగే దిగజారిపోయి వ్యవహరిస్తున్నాడు.  క్షేత్రస్ధాయిలో ఏమి జరిగిందో కూడా తెలుసుకోకుండా ప్రతి విషయాన్ని జగన్ కు ముడిపెట్టేసి నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేసేస్తున్నాడు. దీన్నిబట్టి అర్ధమవుతున్నదేమంటే జగన్ అంటే చంద్రబాబుకు నిలువెత్తునా కసితో మండిపోతున్నాడని.  జగన్ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూడలేకపోతున్నాడు.  పైగా జాతీయస్దాయిలో జగన్ పాపులారిటి పెరుగుతుండటాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాడు. దాంట్లో నుండే  చంద్రబాబులో కసి పుట్టుకొస్తోంది.  ఈ పద్దతి చంద్రబాబుకే మంచిదికాదు. మరి ఎంతకాలం ఇలాంటి రాజకీయాలు చేస్తాడో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: