మంచిమాట : తమని తాము ప్రదర్శించుకున్నప్పుడే సమాజంలో విలువ..!

Divya
పూర్వం ఒక ఊరిలో సుఖదాసు అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఆ సుఖదాసు కు కుమార వర్ధనుడనే ఒక కుమారుడు ఉండేవాడు. చదువు పూర్తయ్యాక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండ వలసిందింగా.. సుఖదాసు తన కుమారుడు కుమార వర్ధనుడు తో చెప్పాడు. దీంతో కుమార వర్ధనుడు మంచి కుటుంబాన్ని పోషించడం కోసం ఒక ఉద్యోగం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందుకు అతడు హర్ష గుప్తుడనే వ్యాపారి వద్దకు వెళ్ళాడు.

హర్ష గుప్తుడు అనే మరొక వ్యాపారి రత్నాచారికి కుమార వర్ధనుడి గురించి సిఫార్సు ఉత్తరం రాసి ఇచ్చాడు. కుమార వర్ధనుడు తరువాత రత్నాచారినీ కలిశాడు. సిఫారసు లేక ఉన్నప్పటికీ ప్రయాణం కారణంగా అతడి బట్టలు మురికి గా మారటం అతడు మాట్లాడే భాష కాస్త మొరటుగా ఉండడం రత్నాచారి గమనించాడు. అతడికి ఉద్యోగం ఇచ్చేది లేదని..అయితే  తర్వాత చెబుదామని చెప్పాడు. తనకు ఇక ఉద్యోగం రాదని కుమార వర్ధనుడుకు  అర్థం చేసుకున్నాడు.
తిరిగి హర్షగుప్తుడు వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు కుమారవర్ధనుడు. ఉద్యోగాన్ని ఆశించి వెళ్లేటప్పుడు చక్కటి..శుభ్రమైన దుస్తులను ధరించి వెళ్లాలని.. మృదువుగా మాట్లాడాలని.. భాషలో తప్పులు లేకుండా చూసుకోవాలని హర్ష గుప్తుడు సలహా ఇచ్చాడు. మనుషులు తమను తాము ఎలా ప్రదర్శించుకోవాలో హర్ష గుప్తుడు కుమార వర్ధనుడికి సూచించాడు. మనిషి మాట్లాడే ప్రతి మాటను ప్రపంచం అంచనా వేస్తూ ఉంటుందని ఆయన తెలిపాడు. ఈసారి అతడు సుమంగళులుడు అనే మరో వ్యాపారవేత్తకు సిఫారసు ఉత్తరం రాసి ఇచ్చాడు.

కుమార వర్ధనుడు తనకు హర్ష గుప్తుడు ఇచ్చిన సూచనలను తుచ తప్పకుండా అలాగే పాటించాడు. సుమంగళులు డి వద్ద  కుమార వర్ధనుడు కార్యదర్శి పదవి సంపాదించాడు. అందుకాదు  ఈ లోకంలో మర్యాద మన్ననలకు ఉన్న విలువ ఏమిటో అతడు అర్థం చేసుకొని హర్ష గుప్తుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. సమాజంలో నలుగురితో సమానంగా జీవించడానికి మర్యాద అనే ఒక పదం గురించి మనకు తెలిసి ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: