మంచిమాట: పాత అనే పదం ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది..!

Divya
అనగనగా ఒక ఊరిలో వెంకయ్య అనే రైతు వుండేవారు.ఆయన దగ్గర ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి, బండి లాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది.

వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండే, వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి దానికి దండిగా మేత వేసి, కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు గడ్డి వేసి ఊరుకునే వాడు.
క్రమంగా అది కూడా దండగ అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి "నీకు పని చేసే వయసు అయిపోయింది శక్తి లేదు. ఇక నీవు నాకు దండగ, నీదారి నువ్వు చూసుకో"  ఆ ముసలి ఎద్దును తరిమేశాడు.
ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే  ఒక బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును  ఎందుకు ఏడుస్తున్నావు?"అని అడిగాడు.. ముసలి ఎద్దు తన జాలి గాధను గోపన్న అనే బాలుడికి వినిపించింది.
గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకొని వెంకయ్య ఇంటికి వెళ్లి "ఈ ఎద్దు నీదే కదూ!"అని అడిగాడు. అవును అని అన్నాడు వెంకయ్య
"దీన్ని నాకు అమ్ముతావా? నీకు వెయ్యివరహాలు ఇస్తాను."అన్నాడు గోపన్న.
 
వెంకయ్య ఆశ్చర్య పోగా 'నీకు తెలియదా? ముసలి ఎద్దు ఇంటి ఎదురుగా కట్టేసి, రోజు దానికి నమస్కరించి, మేత వేసి వెళ్తే బోలెడు ధనం వస్తుంది' అని చెప్పాడు.
వెంకయ్య తన ముసలి ఎద్దును తీసుకొని నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి, పొలం పనులకు వెళ్లేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పడడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య. ఇక తల్లిదండ్రులు అయినా సరే ముసలివాళ్ళు అయ్యారని వారిని ఈ మధ్య కాలంలో చాలామంది ఓల్డ్ ఏజ్ హోం లో వదిలేస్తున్నారు అలా చేయడం చాలా నేరం.. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు కాబట్టి వారిని చక్కగా చూసుకుంటే దేవుడు కూడా అండగా నిలుస్తాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: