మంచిమాట : భూమి మీద జీవించే ఏ ప్రాణి కూడా శాశ్వతం కాదు..!

Divya
ఇక్యూ అనే విద్యార్థి , ఒక గురువు వుండేవారు.ఆ గురువు దగ్గర ఇక్యూ చిన్నప్పటి నుంచే విద్యాభ్యాసం నేర్చుకునేవాడు..ఇక ఇక్యూ చాలా తెలివైనవాడు. అతను విద్యాభ్యాసం చేసే సమయం నుండే ఈ గురువు దగ్గర ఒక విలువైన టీ కప్పు ఉండేది. అది చాలా పురాతనమైనది. అలాగే విలువైంది కూడా.. ఆ టీ కప్పు ఒక్కసారి పొరపాటున ఇక్యూ చేతి నుంచి జారి కింద పడి పగిలిపోయింది. అప్పుడు అతడు ఆందోళనలో పడిపోయాడు. గురువుగారు అక్కడకు వస్తున్నారని గమనించి ఆ ముక్కలను గబగబా తీసేసి వెనుక దాచుకున్నాడు.
ఇక ఇక్యూ తనవైపు పరిశీలనగా చూస్తూన్న గురువుగారిని ఇలా అడిగాడు.
"గురువుగారు మనుషులు ఎందుకు చనిపోవాలి?" అని అడిగాడు ఇక్యూ
"అది చాలా సహజం. పుట్టిన ప్రతిదీ  కూడా ఒక నిర్ణీత సమయం తరువాత మరణించక తప్పదు. ఈ భూమి మీద జన్మించినది ఏది కూడా శాశ్వతం కాదు"అన్నాడు గురువు.
అప్పుడు అతడు వెంటనే తన  వెనుక దాచిపెట్టిన పగిలిపోయిన టీ  ముక్కలను చూపిస్తూ ..ఈ టీ కప్పుకు కూడా ఆ నిర్ణీత సమయం దాటిపోయింది. గురువు గారు అని అన్నాడు
గురువు నవ్వుతూ అతని భుజం తట్టి ముందుకు వెళ్ళిపోయాడు.ఇక ఇక్యు తన తెలివి తేటలతో గురువు గారి దెబ్బల నుంచి తప్పించుకున్నాడు.
గురువుగారు చెప్పినట్టుగా ఈ భూమి మీద ఏ ప్రాణీ లేదా వస్తువు కూడా శాశ్వతం కాదు. మనిషి భగవంతుడు చేత సృష్టించబడితే, మనిషి చేత టెక్నాలజీ సృష్టించబడింది. కాబట్టి ఎవరికి వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదీ కూడా శాశ్వతం కాదని తెలుసుకున్న రోజు, ప్రతి ఒక్కరు ఆనందంగా, సుఖ సంతోషాలతో, సంతోషంగా జీవిస్తారు.. మనిషి ప్రాణమైనా లేదా టీ కప్పు అయినా సరే.. కాబట్టి ఎవరూ కూడా నీది నాది అని తగువులు ఆడుకోవడం కన్నా  ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే అలవాటును నేర్చుకోవడం మంచింది.అప్పుడు  ఈ భూమి మీద చిన్న , పెద్ద , పేద, ధనిక  భావాలు ఉండవు అనేది మాత్రమే శాశ్వతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: