మంచిమాట: మన జీవితంలో ఖచ్చితంగా తెలుసుకోవలసిన సత్యాలు..

Divya

మనం జీవితంలో సంతోషంగా, ఆనందంగా , ధర్మబద్ధంగా ఉండాలి అంటే, తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ సత్యాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా మన జీవితంలో మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు ఏమిటంటే..
1. జ్ఞానం ఉన్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు.
2. స్నేహమంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే అసలైన స్నేహం.
3. అన్నీ ఉన్న వాళ్లకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా, వాళ్ల దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. ఏమీ లేని వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టి చూడు. వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు.
4. మనం మాట్లాడితే కానీ మాట్లాడని  బంధాలను అక్కడే వదిలేయడం ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం చేసుకోవాలి.
5. మనం మంచి చేసాము అనుకుంటాం. కానీ ఆ మనిషి లో కూడా మన చెడుని వెతికే మహానుభావులు ఎప్పుడైనా సరే మన పక్కన ఉంటారని గమనించుకోవాలి.
6. కష్టం విలువ తెలిసిన వారు ఎప్పటికీ ఇతరులను ఎప్పటికీ కష్టపెట్టరు. ఇక ఇష్టం విలువ తెలిసినవారు ఎవర్ని వదులుకోరు.
7. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు ఎందుకంటే జీవితం, నమ్మకం ఒకసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు.
8. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మతిమరుపు చాలా అవసరం. ప్రతి కష్టాన్ని మరిచిపోతేనే జీవితంలో సంతోషంగా ఉండగలరు.
9. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం ఇవే మన జీవితానికి అసలైన ఆస్తులు.
10. కష్టపడితే తప్ప ఫలితం దక్కదని తెలుసుకోవాలి.అందరితోనూ స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా కలిసి ఉన్నప్పుడే జీవితంలో అన్ని సంతోషాలు ఎదురవుతాయి.అంతేకాదు ప్రతి ఒక్కరూ, మంచి, మానవత్వం అనే ఈ రెండు లక్షణాలను అవలంబించుకున్నప్పుడే జీవితం ఏమిటో తెలిసొస్తుంది..ప్రతి ఒక్కరు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: