మంచిమాట: మహా భారతంలో పాండవులు తమ తండ్రి మాంసాన్ని తిన్నారా..?

Divya

మహాభారతం.. ఎన్నిసార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా, ప్రతీసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేసే గొప్ప కథ. ముఖ్యంగా మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పాండు పుత్రులు. నిజమే ఈ పాండు పుత్రులు అయినటువంటి ఐదు మంది ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అయితే వీరిలో బాగా ప్రావీణ్యం పొందిన ధర్మరాజు, భీముడు, అర్జునుడు గురించి మహాభారతంలో ఎక్కువగా ప్రస్తావించబడింది. పాండు రాజు రెండవ భార్య అయిన మాధురిఖికి జన్మించిన అశ్విని కుమారులు అనగా నకులుడు, సహదేవుడు గురించి మహాభారతంలో తక్కువగా ప్రస్తావించబడింది.

ఇక్కడ ముఖ్యంగా నకులసహదేవులకు ఉన్న శక్తి, సామర్ధ్యాలు ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. నకులుడు  అనగా కౌరవ వంశం లో అత్యంత అందగాడు అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే కౌరవ, పాండవ రాజులలో నకులుడు ఎంతో అందంగా ఉండేవాడు. సహదేవుడు అనగా దేవతలతో సమానమైన వాడు అని అర్థం. అందర్లోకి చిన్నవాడైన సహదేవుడు, అందరికన్నా ఎక్కువ తెలివి తేటలను కలిగి ఉంటాడు. సహదేవుడు అపరిమితమైన జ్ఞాన సంపదకు పెట్టింది పేరు. నకులుడు విషయానికొస్తే, ఈయనకు గుర్రాలు అంటే మహా ప్రాణం. వాటికి  కూడా ఈయన అంటే ఇష్టం. ఎంతటి మొండి గుర్రాన్ని అయినా తన కనుసైగతో లొంగదీసుకునే శక్తి సామర్థ్యం కలవాడు నకులుడు. నకులుడు ఉన్నచోట  ప్రతి గుర్రము ఎంతో బలిష్టంగా ,ఆరోగ్యంగా , వేగంగా పరిగెత్తేవి. ఈ అరుదైన విద్య కలగడం వల్ల కురువంశం మొత్తంలో గుర్రపు స్వారీ చేయడంలో నకులుడికి మించిన వ్యక్తి మరొకరు లేరు. నకులుడు గుర్రపు స్వారీ చేస్తున్నాడు అంటే అతని మొహం కూడా కనిపించని, అంత వేగంగా గుర్రపుస్వారీ చేసేవాడట.

ఇక సహదేవుడికి ఆవులు అంటే ఎనలేని ప్రాణం. ఆవులు చెప్పే ప్రతి మాట సహదేవుడికి అర్థమయ్యేది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాటరాజు దగ్గర గుర్రపుశాలలో నకులుడు పనిచేస్తే, సహదేవుడు ఆవుల పాకశాలలో పని చేస్తాడు. ఆయుర్వేదంలో సిద్ధహస్తుడు నకులుడు. రాజ్యంలోని వైద్యులు కూడా నకులుడు సలహాలు తీసుకునేవారు. నకులుడు వైద్యం చేస్తే ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధి కూడా ఇట్టే పారి పోవాల్సిందే. ఇక సహదేవుడు ఆస్ట్రాలజీ జ్యోతిష్యశాస్త్రమే కాకుండా సకల విద్యలలోను సహదేవుడు సిద్ధహస్తుడు. అందరిలోకీ సహదేవుడు అపారమైన జ్ఞాన సంపన్నుడు.. తన తమ్ముడు దేవగురువైన బృహస్పతి అంత గొప్పవాడు అని ధర్మరాజు చాలా సందర్భాల్లో పొగిడేవాడు .పెద్ద పెద్ద గురువులు ఉన్నా కూడా ఏ ముహూర్తంలో కురుక్షేత్ర యుద్ధం మొదలు పెడితే గెలుస్తుందని , స్వయంగా దుర్యోధనుడు ముహూర్తం పెట్టమని సలహా అడిగేవాడు.
యుద్ధ వ్యూహాలు రచించడంలో నకులుడి తర్వాతే ఎవరైనా. ఏ వీరున్ని చంపడానికి ఎలా వ్యూహం  వేయాలో నకులుడి కి చక్కగా తెలుసు.
ఇక అసలు విషయానికి వస్థే, సహదేవుడు తన తండ్రి మెదడును తిన్నాడు. అవును మీరు విన్నది నిజమే.. పాండురాజు చనిపోయే ముందు తన చివరి  కోరికగా తన శవాన్ని ఐదుగురు పాండవులు తినాలని కోరాడు. అలా చేస్తే పాండవులను ఎవరు ఓడించలేరని, మృత్యువుకు  అతీథలు అవుతారని చెప్తాడు. కానీ ఆ పని మాత్రం ఒక్క సహదేవుడు మాత్రమే   చేయగలిగాడు. పాండు రాజు ని దహనం చేస్తున్నప్పుడు ఎంత కష్టమైనా సరే, తన తండ్రి  చివరి కోరికను తీర్చాలని, చితి మంటల్లో దహనం అవుతున్న పాండురాజు మెదడును తీసుకొని తినడం ప్రారంభిస్తాడు. మొత్తం మూడు ముక్కలను కొరకగానే, మొదటి ముక్కతో వర్తమానం, 2 వ ముక్కతో ప్రజెంట్, మూడవ ముక్క తో భవిష్యత్తుని తెలుసుకునే  అపూర్వమైన జ్ఞానం లభించింది.
ఇక నాలుగవ మొక్క యొక్క పోతుండగా సహదేవుని శ్రీకృష్ణుడు ఆపుతాడు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామమని తినకుండా సహదేవునికి ఆపుతాడు.ఇక నీకు ఇప్పటికే  భవిష్యత్ గురించి అన్ని విషయాలు తెలుస్తాయి . కానీ ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల వెయ్యి ముక్కలు అయ్యి  మరణిస్తావని సహదేవునికి చెప్తాడు కృష్ణుడు. భూత, భవిష్యత్ ,వర్తమాన కాలజ్ఞానాన్ని పొందిన  గొప్పవీరుడు సహదేవుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: