అప్పుడూ క్వీన్సే.. ఇప్పుడూ క్వీన్సే! నయన్–త్రిష స్పెషల్ పిక్..ఇప్పటికీ చెరగని అందం!
ఈ ఫోటోలలో ఇద్దరూ బ్లాక్ కలర్ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. నయనతార వైట్ గ్లాసెస్ తో స్టైలిష్ గా కనిపిస్తుంటే, త్రిష లెదర్ జాకెట్ లో అదరగొట్టేసింది.నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి దుబాయ్ లో ఉండగా, త్రిష కూడా అక్కడే వారితో చేరడం విశేషం. వీరిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ దిగిన ఫోటోలు చూస్తుంటే వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అర్థమవుతోంది.వయసు పెరుగుతున్నా ఈ ఇద్దరి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
నయనతార: ఈ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో కీలక పాత్ర పోషించి మెప్పించింది. ప్రస్తుతం యష్ సరసన 'టాక్సిక్' (Toxic) సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.
త్రిష: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' తో పాటు చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతోంది.
ఈ ఫోటోలు వైరల్ అవ్వగానే ఫ్యాన్స్ అప్పుడే కొత్త డిమాండ్లు మొదలుపెట్టారు. "ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఎలా ఉంటుందో 'కాతువాకుల రెండు కాదల్' చూశాం. కానీ నయన్, త్రిష ఇద్దరూ కలిసి ఒక పవర్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే" అని కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి నయనతార, త్రిషల దుబాయ్ రీయూనియన్ టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. హీరోయిన్ల మధ్య కేవలం పోటీ మాత్రమే కాదు, మంచి స్నేహం కూడా ఉంటుందని వీరు నిరూపించారు. రూమర్లకు భయపడకుండా, తమ లైఫ్ ను తమకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు నిజంగానే గ్రేట్!