కార్మేని సెల్వం ఏప్రిల్ 3 రిలీజ్... డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో ‘కార్మేని సెల్వం’ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నారు. ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ మరియు జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా మారుతుంది.
ఈ చిత్రంపై దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ .. “కార్మేని సెల్వం’ ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు. ఈ సినిమాలో నటీనటులుగా సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు నటిస్తున్నారు.