రహస్యంగా ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరో..!

Divya
టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు సంపాదించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు కూడా విభిన్నమైన కథలతో అభిమానులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మార్చి 8వ తేదీన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఎంగేజ్మెంట్ కాబోతోందని వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని పెద్దలను ఒప్పించి మరి ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి.



ఈ వేడుకకు కుటుంబ సభ్యులు ,సన్నిహితుల సమక్షంలోనే చాలా సింపుల్ గా జరగనున్నట్లు సమాచారం. కొంతమంది మిత్రులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నది. శ్రీనివాస్ ఆ అమ్మాయితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం విన్న వెంటనే అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయి ఎవరు అనే విషయంపై అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు.మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.


2014లో అల్లుడు శీను సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, కిష్కింధాపురి తదితర చిత్రాలలో నటించారు. ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . బాలీవుడ్ లో 2023లో చత్రపతి సినిమాని రీమిక్స్ చేసి ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస తండ్రి కూడా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ .ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి విజయాలను అందుకున్నారు. సాయి శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేష్ కూడా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: