ఎట్టకేలకు పెళ్లి వార్తలపై.. క్లారిటీ ఇచ్చేసిన డింపుల్ హయాతి..?
ఇప్పటికీ వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారనే రూమర్స్ కూడా వినిపించాయి. ఇటువంటి సందర్భంలోని తాజాగా డింపుల్ హయాతి తన వివాహం పైన వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఒక అభిమాని పెళ్లి పై ప్రశ్నించిన విషయంపై మాట్లాడుతూ.. గతంలో నాకు వివాహం అయిందని వార్తలు వినిపించాయి నిజానికి నాకు ఇంకా వివాహం కాలేదు. నా పెళ్ళికి సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా సరే తాను నిర్భయంగా చెబుతానని, ఇప్పటివరకు వినిపించిన వార్తలలో ఎలాంటి నిజము లేదు. దయచేసి ఇలాంటి రూమర్సును ఎవరు సృష్టించవద్దు, నమ్మవద్దు అంటే క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ హయాతి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నానని పెళ్లి గురించి ఇప్పుడప్పుడే ఆలోచించే సమయం రాలేదంటూ తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 2017 లో వచ్చిన గల్ఫ్ అనే చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ . ఆ తర్వాత యురేక, దేవి 2, గద్దల కొండ గణేష్, సామాన్యుడు, ఖిలాడి, రామబాణం తదితర చిత్రాలలో నటించింది. ఇటీవలే విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ దాసరి నారాయణరావు గారు తాతయ్య అవుతారని, అలాగే సీనియర్ హీరోయిన్ ప్రభా గారు కూడా తనకి నానమ్మ వర సాగుతుందని తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులు ఆశ్చర్యపోయారు.