మంచిమాట : సహాయం విలువ ఎంత గొప్పదో నేర్పిన శ్రీకృష్ణ కర్ణ..

Divya

కర్ణ మహారాజు దానం చేయడంలో ఎంతటి మహోన్నతుడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండవ చేతికి కూడా తెలియకుండా దానం చేసే కర్ణుడి మంచి మనసు గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఒకరోజు  శ్రీకృష్ణుడు పొద్దుపొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళారు. అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో నిండి వున్నది. కృష్ణుడు కర్ణుని దగ్గరకు వచ్చి రాగానే,  కర్ణా ఆ గిన్నె చాలా విలువైనది నాకిస్తావా? అని అడిగాడు.
వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా ..అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె యిచ్చాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ? ఎడమచేత్తో గిన్నె యిస్తున్నావు?  కుడిచేత్తో ఇవ్వకూడదా?  అని అన్నాడు.
అందుకు కర్ణుడు.. కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునేలోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి
చంచలమైనది. ఒకచోట స్థిరంగా ఉండలేనిది. ఇక యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణంలో ఎలా మారుతుందో  ఎవరికీ తెలియదు. కాబట్టి గిన్నె ఈ చేతి నుంచి ఆ చేతికి మారే లోపలే ఏమైనా జరగొచ్చు.
అందుకనే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే
చెయ్యాలనే మంచి మాటను ననుసరించి యిలా చేశాను.అన్నాడు.
అప్పుడు కృష్ణుడు కర్ణుని తెలివి తేటలకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు.అందుకు కర్ణుడు..
కృష్ణా! అడగడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం. అంతే కాదు నీచం కూడా.. కనుక ఏ జన్మ లోనూ దేహీ అని , లేదు అనే ఈ రెండు మాటలు నా నోటివెంట రాకుండా వుండేటట్లు నన్ను  అనుగ్రహించు. అని కోరాడు.దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో అర్థమవుతుంది.
దానం విషయంలో ఎల్లప్పుడూ ఎలాంటి  స్వార్థం లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి. ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి ఆలస్యం విషం లాంటిది.మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్తికొలది దానం చేయడం అలవరుచుకోవాలి. అంతేకాకుండా ఏ విషయంలోనూ ఎవరిని అడగడకుండా, అడిగినవారికి లేదనకుండా జీవనం కొనసాగించడం మనిషి జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: