మంచి మాట: తులసి చెట్టు ఒక భవిష్యవాణి లాంటిది.

Divya

సాధారణంగా తులసిని ఇంటి ముందు కుంపట్లో పెంచుకుంటూ, దేవతలా పూజిస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా ఈ తులసి వల్ల మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల మన అనారోగ్య సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. అటు ఆధ్యాత్మికంగా కూడా తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అని, దాని వల్ల అంతా మంచే జరుగుతుంది అని కూడా చెబుతారు.. అయితే ఇంట్లో ఉన్న తులసి అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవడమో లేక ఉన్నట్టుండి ఆకులు ఎండిపోవడమో,రాలిపోవడమో ఇలా భౌతికంగా అనేకరకాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతుందట.. అలా మార్పులు జరిగినప్పుడు, ఆ ఇంట్లో ఉండే వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు అంటున్నారు పండితులు.. అయితే దాని విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి చెట్టు ఆకులు ఆకస్మాత్తుగా, వేరే ఏదైనా రంగులోకి మారితే దాని అర్థం ఏమిటంటే, ఆ ఇంట్లో ఉన్న వారిపై ఎవరో తంత్ర, క్షుద్ర శక్తులను ప్రయోగించ బోతున్నారని అర్థం. అలా ఆ ఇంట్లో వారిపై ప్రయోగించి, నాశనం చేయాలని చూస్తే అప్పుడు తులసి ఆకులు రంగు మారుతాయట.
ఇక నిత్యం నీళ్ళు పోస్తూ, చక్కగా పెంచుకుంటున్న తులసి చెట్టు ఎండిపోతే, ఇంటి యజమానికి మరికొద్ది రోజుల్లో ఆరోగ్య పరంగా ఏదో కీడు జరగబోతోందని అర్థం.
తులసి చెట్టుకు ఒకవేళ నీళ్లు పోయకుండానే బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే,అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టం కలిసి రాబోతోందని అర్థం.
తులసి చెట్టును ఉంచిన కుండీలో దానంతట అదే, మరో తులసి మొక్క పుట్టుకొస్తే, ఆ ఇంట్లో వారికి కెరియర్ పరంగా మంచి జరుగుతుందట.
తులసి చెట్టు పచ్చగా ఉన్న ఇంట్లో ఎల్లప్పుడు సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయట.అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావట.. చూశారు కదా తులసి చెట్టు వల్ల ఎలాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చో.. అయితే మీరు కూడా మీ ఇంటి ముందున్న తులసి చెట్టు ఎలాంటి రంగులను మారుస్తోందో తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: